న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Nov 2019 9:24 PM IST
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్

1. విధుల్లో చేరండి : సీఎం కేసీఆర్‌

తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణలోఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎట్టకేలకు ఫలితం లభించింది. ఇన్ని రోజుల పాటు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురు వినిపించారు. గురువారం కేబినెట్‌ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌, అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి కార్మికులు విధుల్లోచేరాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. ఫ‌లించిన ఠాక్రే శ‌ప‌థం.. మ‌హారాష్ట్ర పీఠంపై శివసైనికుడు.!

మహారాష్ట్ర నూతన సీఎం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో ఈ రోజు సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు. దీంతో.. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చోబెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

3. గంటల వ్యవధిలో యువతి హత్య కేసును చేధించిన పోలీసులు

దీన్‌ దయాల్‌ నగర్‌ కు చెందిన యువతి హత్య సంబంధించిన కేసులో ఈ రోజు నిందితుడుని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడి నుంచి ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు జనగామ జిల్లా, ఘన్‌పూర్‌ మండలం, నెమిలిగొండ్ల గ్రామానికిచెందిన పులిపాయిగౌడ్‌ ఆలియాస్‌ సాయికుమార్‌ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. వెటర్నరీ డాక్ట‌ర్ దారుణ హ‌త్య‌.. చంపింది వారేనా..?

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని చటాన్ పల్లి శివారులో దారుణం జరిగింది. శంషాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డి అనే యువతిని గుర్తుతెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త్య‌చేశారు. యువతి పై పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హ‌త‌మార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. కాబోయే సీఎం ఉద్ధవ్ థాకరేకు సోనియా లేఖ‌..!

మ‌హారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్న శివ‌సేన అధినేత‌ ఉద్ధవ్ థాకరే కు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ లేఖ రాశారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో తాను పాల్గొన‌లేన‌ని ఆ లేఖలో సోనియా పేర్కొన్నారు. సోనియా లేఖ‌లో.. ఉద్ధవ్ తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాలని ఆమె కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. రెచ్చిపోయిన మృగాళ్లు… పుట్టిన రోజు నాడే అత్యాచారం.. హత్య!

వరంగల్‌ జిల్లాలో మళ్లీ మానవమృగాలు రెచ్చిపోయాయి. ఇటీవల హన్మకొండలో చిన్నారి శ్రీహిత్య హత్యాచారం కేసు మరవముందే కామాంధులు మరో దారుణానికి ఓడిగట్టారు. ఓ యువతి పుట్టిన రోజు నాడే.. ఆమెకు చివరి రోజుగా మిగిల్చారు. ఈ ఘటన హన్మకొండలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. దీనదయాళ్‌నగర్‌లో యువతి, యువతి తల్లిదండ్రులు నివాసముంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి..!

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు తన పార్టీ నేతలతో కలిసి అమరావతి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు నల్లజెండాలు ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. వెంకటపాలెం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. వారిద్ద‌రి త‌ర్వాత రోహితే..! ఓ రేంజ్‌లో ఇర‌గ‌దీస్తున్నాడు.!

టీమిండియా క్రికెట‌ర్‌ రోహిత్‌శర్మ గ‌త కొంత కాలంలో భీక‌ర ఫామ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌న్డేలు, టీ20 లే కాదు.. టెస్టుల్లో కూడా ఇర‌గ‌దీస్తున్నాడు. మూడు ఫార్మ‌ట్ల‌లో ఓపెన‌ర్ గా సెటిల్డ్ పెర్మామెన్స్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇక్క‌డి వ‌ర‌కూ ఓకే… మైదానంలో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడే.. ‘హిట్‌మ్యాన్’ ప్రచారకర్తగా కూడా ఓ ఊపు ఊపుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. ప్రయాణికులకు షాకిచ్చిన ‘కేసీఆర్‌’

52 రోజుల పాటు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు శుభవార్త వినిపించారు సీఎం కేసీఆర్‌. కార్మికులు రేపటి నుంచి విధుల్లో చేరాలని సూచించారు. ఈ రోజు నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒక వైపు కార్మికులకు తీపి కబురు వినిపిస్తూ మరో వైపు ప్రయాణికుల షాకిచ్చారు కేసీఆర్‌. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. ప్రియాంకరెడ్డి హత్య కేసు : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఏమన్నారంటే..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో చటాన్‌పల్లిలో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్రియాంకరెడ్డిపై పెట్రోల్‌ పోసి నిప్పటించి సజీవదహనం చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story