రెచ్చిపోయిన మృగాళ్లు... పుట్టిన రోజు నాడే అత్యాచారం.. హత్య!

By అంజి  Published on  28 Nov 2019 4:13 AM GMT
రెచ్చిపోయిన మృగాళ్లు... పుట్టిన రోజు నాడే అత్యాచారం.. హత్య!

వరంగల్‌ జిల్లాలో మళ్లీ మానవమృగాలు రెచ్చిపోయాయి. ఇటీవల హన్మకొండలో చిన్నారి శ్రీహిత్య హత్యాచారం కేసు మరవముందే కామాంధులు మరో దారుణానికి ఓడిగట్టారు. ఓ యువతి పుట్టిన రోజు నాడే.. ఆమెకు చివరి రోజుగా మిగిల్చారు. ఈ ఘటన హన్మకొండలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. దీనదయాళ్‌నగర్‌లో యువతి, యువతి తల్లిదండ్రులు నివాసముంటున్నారు. బుధవారం తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్తున్నానని చెప్పిన ఆ యువతి బయటకు వెళ్లింది. సాయంత్రమైన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. యువతి ఫోన్‌ స్విచ్ఛాప్‌ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో వెంటనే యువతి కోసం చాలా చోట్ల వెతికి తల్లిదండ్రులు, బంధువులు.. ఎక్కడ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి సమయంలో హంటర్‌ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో ఓ యువతి మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులుకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సమాచారం మేరకు యువతి మృతదేహాం వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు... తమ కూతురు ఇకలేదని తెలిసి గుండెలు పగిలేలా రోదించారు. వారి రోదనలు స్థానికుల హృదయాలను కలచివేశాయి. యువతి మర్మాంగం నుంచి తీవ్ర రక్త స్రావం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. యువతి శరీరంపై పెద్దగా గాయాలు మాత్రం కాలేదు. దీంతో యువతిపై సామూహిక హత్యచారానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో యువతి చెప్పులు, బీరు సీసాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో పెద్దగా వీధి దీపాలు కూడా లేవు.. పూర్తి నిర్మానుష్య ప్రాంతంగా ఉంది. సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా యువతికి తెలిసిన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారా. లేక ఇంకెవరైనా ఈ దారుణాని ఒడిగట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి స్నేహితులను పిలిచి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story
Share it