52 రోజుల పాటు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు శుభవార్త వినిపించారు సీఎం కేసీఆర్‌. కార్మికులు రేపటి నుంచి విధుల్లో చేరాలని సూచించారు. ఈ రోజు నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒక వైపు కార్మికులకు తీపి కబురు వినిపిస్తూ మరో వైపు ప్రయాణికుల షాకిచ్చారు కేసీఆర్‌. ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన కేసీఆర్‌…ఆర్టీసీ ఛార్జీలు కిలో మీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ పెంపు సోమవారం నుంచి అమలవుతుందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరితే ఎలాంటి షరతులు విధించమన్నారు. ప్రైవేటు పర్మిట్లు కూడా ఆర్టీసీ వాళ్లకే ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రగతిభవన్‌కు త్వరలో కార్మికులను పిలుస్తామని, మంచి చెడులు తానే అడిగి తెలుసుకుంటానని చెప్పారు. ఆర్టీసీ సమస్యపై కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఆయన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.