న్యూస్‌మీట‌ర్ టాప్ 10 న్యూస్‌

By సుభాష్  Published on  15 July 2020 9:48 AM GMT
న్యూస్‌మీట‌ర్ టాప్ 10 న్యూస్‌

మాస్క్‌ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు కోటికిపైగా నమోదు కాగా, లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనా కట్టడికి పలుదేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం: కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను బుధవారం జరిగే కేబినెట్‌ సమావేశం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

విద్యార్థుల విషయంలో ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్..!

ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ కొద్దిరోజుల కిందట ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థులే కాకుండా యూనివర్సిటీలు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. తమ నిర్ణయం తప్పని గుర్తించిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

అతడు బీజేపీ అధ్యక్షుడు.. ఆమె కాంగ్రెస్ ఉపాధ్యక్షరాలు కానీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు

రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకునే ఉదంతాలు చూస్తే..ఇలా కూడా జరుగుతాయా? అన్న సందేహాలు వ్యక్తం కావటం ఖాయం. వేర్వేరు పార్టీలకు చెందిన నేతలంటేనే.. వారి మధ్య విధానపరమైన శత్రుత్వాలు మొదలు.. ఇతర అంశాలు చాలానే ఉంటాయి. అందుకు భిన్నంగా అలాంటి భిన్న ధ్రువాల మధ్య పెళ్లి అనే బంధం మొదలు కావటం చాలా అరుదుగా జరిగేదని చెప్పక తప్పదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ సొంతం చేసుకున్న హోల్డర్.. కోహ్లీ, బుమ్రా ఏ ర్యాంకుల్లో ఉన్నారంటే..?

చాలా కాలం గ్యాప్ తర్వాత క్రికెట్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంఫ్టన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బాగా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. మొత్తం ఏడు వికెట్లు ఈ టెస్టులో తీశాడు హోల్డర్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చెయ్.. లేదా ఆర్మీ ఉద్యోగాన్ని మానెయ్.!

న్యూఢిల్లీ: భారత సైన్యంలో పని చేస్తున్న వారు కొన్ని యాప్స్, సామాజిక మాధ్యమాలను వాడకూడదని తెలిపిన సంగతి తెలిసిందే. అందులో ఫేస్ బుక్ కూడా ఉంది. భారత ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సదరు సీనియర్ ఆఫీసర్ కు చీవాట్లు పెట్టింది. ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చెయడమో లేదంటే ఆర్మీలో ఉద్యోగాన్ని మానేయడమో అన్నది వారి చేతుల్లో ఉంటుందని తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

కేంద్రం కీలక నిర్ణయం: బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్‌ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నాలుగు లైన్లు ఉండే ఈ సొరంగం.. అసోంలోని గోహ్‌పూర్‌, నుమాలీగఢ్‌ను కలుపుతుంది. నది అడుగు భాగంలో ఈ టన్నెల్‌ నిర్మించడంతో భారత్‌లో తొలిసారి. ఈ సొంగాన్ని జియాన్షు ప్రావిన్స్‌ లో తైహు సరస్సు అడుగున నిర్మిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

కరోనా విజృంభణ: హైదరాబాద్‌లో హైరిస్క్‌ జోన్లను ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం మరింత వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో నమోదయ్యే అత్యధిక కేసులు ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంటున్నాయి. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు, అలాగే ప్రజాప్రతినిధులు, పోలీసులు ఇలా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

ఏపీ కేబినెట్‌ భేటీ.. కొత్త జిల్లాలపై కీలక నిర్ణయం

ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో 22 అంశాలపై చర్చించింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ కేబినెట్‌ భేటీలో కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మార్చి 31లోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

గ‌ర్జించిన లేడీ సింగం..!

ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్‌. గుండె నిండా ధైర్య, వృత్తిపై ఎన‌లేని గౌర‌వం, విధుల‌ను క‌చ్చితంగా నిర్వ‌ర్తించాల‌న్న సంక‌ల్పం. అందుకే క‌రోనా నేప‌థ్యంలో క‌ర్ఫ్యూ విధించిన స‌మ‌యంలో ఏదో ఒక మిష‌తో బైటికి వ‌చ్చిన ఓ యువ‌కుణ్ణి నిల‌దీసింది. క‌ర్ఫ్యూ వేళ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎందుకు తిరుగుతున్నావ్ అంటూ ఉరిమింది. అత‌ను సారీ అనేసి ఉంటే క‌థ కంచికి వెళ్లేది.. కానీ సారీ చెప్ప‌లేదు. కార‌ణం త‌న స్నేహితుడు ఎమ్మెల్యే కొడుకు అన్న అహంకార‌మే. వ్య‌వ‌స్థ అంటే లెక్క‌లేనిత‌నం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Next Story
Share it