మాస్క్‌ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!

By సుభాష్  Published on  15 July 2020 2:52 AM GMT
మాస్క్‌ ధరించకుంటే రూ. 10వేల జరిమానా!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు కోటికిపైగా నమోదు కాగా, లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనా కట్టడికి పలుదేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యూకే కూడా పలు కఠినమైన నిబంధనలు అందుబాటులోకి తీసుకొస్తోంది. జూలై 24 నుంచి బహిరంగ ప్రదేశాలు, షాపుల్లో మాస్క్ లు తప్పనిసరిగ్గా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

ఒకవేళ ఎవరైన మాస్క్‌ లు ధరించకుంటే 100 పౌండ్ల జరిమానా విధించనుంది. అంటే మన కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.10వేలు. ఇంగ్లాండ్‌ మొత్తం ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే జరిమానా విధించే అధికారిన్ని పోలీసులకు అప్పగించింది. యూకేలో ఇప్పటి వరకు మూడు లక్షల చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు ఆ దేశంలో 45వేల మందికిపైగా మరణించారు. ఇలా అన్ని దేశాల్లో కూడా కరోనా తీవ్రంగా వ్యాపిస్తుండటంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించి, ఆ తర్వాత సడలింపులు ఇవ్వడంతో మళ్లీ కేసులు తీవ్రతరం అవుతున్నాయి. ఇకలాక్‌డౌన్‌ విధిస్తే భారీ నష్టాలు ఎదురవుతున్న కారణంగా కొన్ని కొన్ని దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుంటే, మరి కొన్నిదేశాల్లో నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి.

ఇక భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌ విధించేందుకు మొగ్గు చూపుతున్నాయి. భారత్‌తో ఇప్పటి వరకు 9లక్షలకుపైగా దాటేసింది. ఇక మరణాలు 28వేలకు పైగా ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌3వ స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది.

Next Story