కరోనా విజృంభణ: హైదరాబాద్‌లో హైరిస్క్‌ జోన్లను ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

By సుభాష్  Published on  15 July 2020 6:13 AM GMT
కరోనా విజృంభణ: హైదరాబాద్‌లో హైరిస్క్‌ జోన్లను ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం మరింత వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో నమోదయ్యే అత్యధిక కేసులు ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంటున్నాయి. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు, అలాగే ప్రజాప్రతినిధులు, పోలీసులు ఇలా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇక హైదరాబాద్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను హై రిస్క్‌ జోన్లుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

హైరిస్క్‌ ప్రాంతాలు ఇవే..

చార్మినార్‌, రాజేంద్రనగర్‌, యూసుఫ్‌ గూడ, మెహిదీపట్నం, కార్వాన్‌, అంబర్‌పేట, చంద్రాయణగుట్ట, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో దాదాపు500లపైగా కరోనా కేసులు ఉండటంతో వాటిని హై రిస్క్ జోన్లుగా ప్రకటించింది.

ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం నోడల్‌ ఆఫీసర్లను నియమించింది. అయితే కరోనా కేసులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అధికారులు కట్టదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అలాగే హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్న వారికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టే విధంగా ముందుకెళ్తోంది.

హైరిస్క్‌ జోన్లలో నోడల్‌ ఆఫీసర్ల వివరాలు:

చార్మినార్‌ - పీఎస్‌ రాహుల్‌రాజ్‌

రాజేంద్రనగర్‌ - బదావత్‌ సంతోష్‌

యూసుఫ్‌ గూడ - కే. యాదగిరి

మెహిదీపట్నం - జే. శంకరయ్య

చంద్రాయణగుట్ట- విజయలక్ష్మీ

కుత్బుల్లాపూర్‌ - ప్రియాంక ఆల

అంబర్‌పేట - జయరాత్‌ కెనడి

కార్వాన్‌ - బి. సంధ్య

Next Story