అతడు బీజేపీ అధ్యక్షుడు.. ఆమె కాంగ్రెస్ ఉపాధ్యక్షరాలు కానీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 6:02 AM GMT
అతడు బీజేపీ అధ్యక్షుడు.. ఆమె కాంగ్రెస్ ఉపాధ్యక్షరాలు కానీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు

రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకునే ఉదంతాలు చూస్తే..ఇలా కూడా జరుగుతాయా? అన్న సందేహాలు వ్యక్తం కావటం ఖాయం. వేర్వేరు పార్టీలకు చెందిన నేతలంటేనే.. వారి మధ్య విధానపరమైన శత్రుత్వాలు మొదలు.. ఇతర అంశాలు చాలానే ఉంటాయి. అందుకు భిన్నంగా అలాంటి భిన్న ధ్రువాల మధ్య పెళ్లి అనే బంధం మొదలు కావటం చాలా అరుదుగా జరిగేదని చెప్పక తప్పదు.

కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అందరి నోట నానుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని ఒక పంచాయితీకి బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు భీమాశంకర్ హోన్నికేరి. అదే పంచాయితీకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు రుక్మిణీ జమేదార్. అధికార.. విపక్షాలైన ఈ రెండుపార్టీలకు చెందిన ఈ ఇద్దరి నేతల మధ్య విమర్శలు మామూలే.

ఇదిలా ఉండగా.. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవటం స్థానికంగా సంచలనంగా మారింది. ఇద్దరూ అవివాహితులే కావటం.. తమ పార్టీల్నిపక్కన పెట్టి.. వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరికున్నప్రేమాభిమానాలతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తమ ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దల నుంచి అనుమతి తీసుకున్నారు. తాజాగా నెలకొన్న కరోనా నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి సింఫుల్ గా సాగింది. రెండు భిన్న పార్టీలకు చెందిన నాయకుల మధ్య జరిగిన ఈ పెళ్లికి రెండు పార్టీలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ పెళ్లి ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

Next Story