న్యూస్‌మీట‌ర్ తెలుగు టాప్ 10 న్యూస్

By Medi Samrat  Published on  19 July 2020 11:13 AM GMT
న్యూస్‌మీట‌ర్ తెలుగు టాప్ 10 న్యూస్

1. తెలంగాణ‌లో శాంతించ‌ని క‌రోనా.. కొత్త‌గా 1284 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,883 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1,284 కేసులు పాజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 43,780 కేసులు నమోదు కాగా, 409 మంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య.. చనిపోయేందుకు రావాలని దెయ్యం పిలుస్తోంది..

ఓ విద్యార్థిని నర్సింగ్‌ చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలను చేసుకుంది. అయితే.. అప్పటి నుంచి ఎవ్వరితోనూ మాట్లాడలేదు. చనిపోయేందుకు రావాలని దెయ్యం పిలుస్తోందని, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే.. ఇంట్లో వాళ్లందరిని చంపేస్తానని బెదిరిస్తోందని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. జూలై 19 ఆదివారం నుండి జూలై 25 శనివారం వరకు రాశి ఫ‌‌లాలు

Advertisement

మేష రాశి : ఈ రాశివారికి ధనలాభము సంపద ఆనందాన్ని కలగజేస్తున్నాయి. సముడైన చంద్రుడు వీరికి లాభ సూచనను కల్పింప చేస్తున్నాడు. యోగ కారకుడైన కుజుడు మాత్రం వ్యయంలో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. మారకుడైన శని రాజ్యస్థాన మైన పదిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఒత్తిడులను.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ప్రియురాలు దూరం పెడుతోందని..

వారి ప్రేమకు లాక్‌డౌన్‌ అడ్డువచ్చింది. లాక్‌డౌన్‌లో ప్రియురాలిని చూడలేకపోయాడు. ఎలాగైన ఆమెను చూడాలని సాహసం చేశాడు. ఏకంగా ప్రియురాలి ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కైయ్యాడు. ఆ తరువాత నుంచి ఆ యువతి అతడిని దూరం పెట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతినే అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Advertisement

5. ఐఎంఏ హెచ్చరిక.. దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతకొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 10లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) హెచ్చరికలు జారీచేసింది. దేశంలో కొవిడ్‌-19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భారత్‌లో కరోనా విలయం.. 24గంటల్లో 38,902కేసులు.. 543 మంది మృతి

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 38,902 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 543 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. భారత అభిమానిపై ఇంజమామ్‌ దాడి.. అజారుద్దీన్‌ భార్యను అలా అనేసరికి..

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే అభిమానులకు పండుగే. ప్రపంచకప్‌ గెలవకున్నా ఫరవాలేదు.. పాకిస్థాన్‌పై గెలిస్తే చాలు అని చాలా మంది అభిమానులు చెప్పే మాట. భారత్‌,పాక్‌ ఆడుతున్నాయంటే.. ఓ యుద్దం జరుగుతున్నట్లే బావిస్తారు. ఆటగాళ్లు కూడా అలాగే తలపడుతారు. మైదానంలో ఎలాగున్నా సరే.. మైదానం బయట ఇరు జట్ల ఆటగాళ్లు ఎంతో స్నేహంగా ఉంటారనే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్రభాస్‌ 21 సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ఎంటంటే..?

ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఇచ్చింది వైజయంతీ మూవీస్. ‘రాధే శ్యామ్’ చిత్రం తరువాత ప్రభాస్.. టాలెండెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. తిరుపతి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పై తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌ వే పై పరిశీలనకు వెళ్లిన పైర్‌ ఇంజిన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. బెంగళూరు నుంచి 71 మంది ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కు సన్నద్దమవుతున్న తరుణంలో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బ్యాంకులకు భారీగా టోపీ పెట్టిన కంపెనీల్లో.. తెలుగు కంపెనీలు ఏవంటే..

ఎప్పటి నుంచో వినిపించే ఆరోపణే కానీ.. తాజాగా వివరాలతో సహా బయటకు రావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఏళ్లకు ఏళ్లు బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పటికీ.. లక్ష రూపాయిల లోన్ కోసం ప్రాసెస్ భారీగా ఉంటుంది. సామాన్యుడికి ఉండే ఈ కష్టం.. బడా బాబులకు.. బడా కంపెనీల పేరుతో చేసే దందాల దగ్గరకువచ్చేసరికి అలాంటివేమీ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Next Story
Share it