భారత అభిమానిపై ఇంజమామ్‌ దాడి.. అజారుద్దీన్‌ భార్యను అలా అనేసరికి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2020 5:36 AM GMT
భారత అభిమానిపై ఇంజమామ్‌ దాడి.. అజారుద్దీన్‌ భార్యను అలా అనేసరికి..

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే అభిమానులకు పండుగే. ప్రపంచకప్‌ గెలవకున్నా ఫరవాలేదు.. పాకిస్థాన్‌పై గెలిస్తే చాలు అని చాలా మంది అభిమానులు చెప్పే మాట. భారత్‌,పాక్‌ ఆడుతున్నాయంటే.. ఓ యుద్దం జరుగుతున్నట్లే బావిస్తారు. ఆటగాళ్లు కూడా అలాగే తలపడుతారు. మైదానంలో ఎలాగున్నా సరే.. మైదానం బయట ఇరు జట్ల ఆటగాళ్లు ఎంతో స్నేహంగా ఉంటారనే విషం తెలిసిందే. ఇప్పటికే కొద్ది మంది ఆటగాళ్లు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా పాకిస్థాన్ దిగ్ఘజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌.. భారత్‌, పాక్‌ ఆటగాళ్లు ఎలా ఉంటారనే విషయాన్ని వెల్లడించారు.

భారత ఆటగాడి భార్యను ఓ అభిమాని అసభ్యంగా కామెంట్‌ చేశాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ భారత అభిమానిని బ్యాట్‌తో కొట్టబోయాడని వకార్‌ యూనిస్‌ చెప్పాడు. ఈ ఘటన 1997 సహారా కప్‌లో చోటు చేసుకుందన్నాడు. సహారా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. అప్పుడు ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. ఇంజమామ్‌ బౌండరీ దగ్గర పీల్లిండ్‌ చేస్తున్నాడు. భారత అభిమానులు తనను అవమానించేలా కామెంట్‌ చేసినా ఇంజమామ్‌ పట్టించుకోలేదు. ఆ తరువాత ఎవరో భారత ఆటగాడు అజహరుద్దీన్‌ భార్యపై అసభ్యంగా కామెంట్‌ చేశాడు. దీంతో ఇంజమామ్‌ తట్టుకోలేకపోయాడు.

కోపంతో మైదానంలోనే 12వ ఆటగాడిని ఒక బ్యాట్‌ తీసుకురమ్మని చెప్పాడు. ఆ బ్యాట్‌ తీసుకుని మైదానంలోంచి స్టాండ్స్‌లో కూర్చున్న ఒక వ్యక్తిని పట్టుకుని పట్టుకుని వచ్చాడు. అలా చేసినందుక ఇంజమామ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేదం పడింది. అది అంతటితో సమసిపోలేదు. కోర్టు దాకా వెళ్లింది. చివరికి అజహరుద్దీన్‌ కలగజేసుకుని సదరు అభిమానితో మాట్లాడి వివాదం సమసిపోయేలా చేశాడని చెప్పాడు వకార్‌. మైదానంలోనే పోరాడుతామని, బయట మాత్రం స్నేహపూర్వకంగా ఉంటామని వకార్‌ చెప్పుకొచ్చాడు.

Next Story