పుట్టిన రోజు నాడు తమిళ హీరోని సర్‌ప్రైజ్‌ చేసిన జ్వాలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 12:46 PM GMT
పుట్టిన రోజు నాడు తమిళ హీరోని సర్‌ప్రైజ్‌ చేసిన జ్వాలా

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ జ్వాల గుత్తా తమిళ యంగ్‌ హీరో విష్ణు విశాల్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్‌ సందర్భంగా విష్ణు విశాల్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్‌ చేసి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా విష్ణు చెన్నైలో జ్వాల హైదరాబాద్‌లో లాక్‌ అయిపోయారు. ఒకరినొకరం మిస్‌ అవుతున్నామంటూ ఈ ప్రేమ పక్షులు అప్పట్లో సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా చేశారు.

నేడు విష్ణు విశాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడి ఇంటికి వెళ్లి స్వీట్‌ సర్‌ ఫ్రైజ్‌ ఇచ్చింది జ్వాలా గుత్తా. అతడితో కేక్‌ కట్ చేయించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే బేబీ అంటూ పోస్టు చేసింది.

అంతేకాదు విష్ణు కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేశాడు. మై బేబీ సర్‌ ప్రైజ్‌ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story