న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  28 May 2020 10:23 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

తెలంగాణ‌లో కొత్త‌గా 117 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. గురువారం రాత్రి 8.30 గంటలకు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బాలకృష్ణ బూతు మాట కూడా మాట్లాడారు.. క్షమాపణలు చెప్పాలి: నాగబాబు

టాలీవుడ్ అగ్ర‌హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, పేప‌ర్ల‌తో చూసి మాత్ర‌మే తెలుసుకున్నాన‌ని అన్నారు. వారందరూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి భూములు పంచుకుంటున్నారా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. మా అధ్య‌క్షుడు న‌రేష్ కూడా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా పోవాలని.. ఆలయంలో అమ్మవారికి నరబలి ఇచ్చిన పూజారి

ప్రపంచం ఒక వైపు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ.. ఇంకా అత్యున్నతమైన టెక్నాలజీని సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంటే దానికి వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు పరిశోధకులు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉన్న ప్రస్తుతం కాలంలో మూఢనమ్మకాలను.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గుడ్‌న్యూస్‌: జూన్‌ 1నాటికే రుతుపవనాలు

భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు, రైతులకు గుడ్‌న్యూస్‌ వినిపించింది. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే .. మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడు లేనంతగా తీవ్రంగా ఎండలు దంచికొడుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ చల్లని కబురు చెప్పింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అచ్చం పుల్వామా అటాక్ లాగే ప్లాన్ చేశారు..!

శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడిని భారతదేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ ఘటన తర్వాత తీవ్ర వాదులపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా భారత సెక్యూరిటీ ఫోర్స్ పుల్వామా అటాక్ లాంటి మరో ఉగ్రదాడిని ఆపగలిగారు. పుల్వామా జిల్లాలో 20 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైస్(ఐఈడి)లతో వెళుతున్న కారును అధికారులు పట్టుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బ్రేకింగ్‌: విషాదం: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి (వీడియోతో..)

మెదక్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో సాయివర్ధన్‌ అనే మూడేళ్ల బాలుడు నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన విషయ తెలిసిందే. కానీ చివరికి బాలునికి సరైన ఆక్సిజన్‌ అందక మృతి

చెందాడు. వ్యవసాయం పొలం వద్ద బాలుని తండ్రి బోరువేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నట సార్వభౌముడికి ప్రముఖుల ఘన నివాళి

నంద‌మూరి తార‌క‌రామారావు 97వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు ఆయ‌నకి ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు. బాల‌కృష్ణ‌తో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఇంటి వ‌ద్ద ఉండే త‌మ తాత‌కి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పూజా హెగ్డే అకౌంట్ నుండి సమంతపై అభ్యంతకర వ్యాఖ్యలు.. నిజమేమిటంటే..!

సోషల్ మీడియాలో తమకు అంతమంది ఫాలోవర్లు, ఇంతమంది ఫాలోవర్లు అని సెలెబ్రిటీలు తెగ ఆనందపడుతూ ఉంటారు. కానీ వారి సోషల్ మీడియా అకౌంట్ లకు ఉండే కష్టాలు ఎన్నో ఉంటాయి. పొరపాటున అకౌంట్ హ్యాకింగ్ కు గురై.. ఎవరి గురించైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు పోస్టులు వస్తే మాత్రం చాలా కష్టమే..! తాజాగా హీరోయిన్ పూజా హెగ్డేకు అలాంటి అనుభవమే ఎదురైంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాముతో స్కెచ్‌వేసి భార్యను చంపిన భర్త.. పాముకు శవ పరీక్ష

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఏ పని చేయాలన్నా ఎక్కువగా టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. కానీ మంచి పనులకు టెక్నాలజీని ఉపయోగిస్తే మంచిది.. కొందరు చెడు పనులకు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఇక యూట్యూబ్‌లో మనకు ఎన్నో వీడియోలు లభిస్తుంటాయి. అందులో మంచి ఉంటుంది.. చెడు ఉంటుంది. కానీ చెడు కోసమే ఎక్కువగా ఉయోగిస్తూ కటకటాల పాలవుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ధోని రిటైర్‌మెంట్‌ను ఖండించిన సాక్షి.. కొద్దిసేప‌టికి ఆ ట్వీట్ డిలీట్‌

భార‌త క్రికెట్‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో త‌న పేరును లికించుకున్నాడు మ‌హేంద్ర‌సింగ్‌ ధోని. భార‌త్‌కు రెండు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లు (2007లో టీ20, 2011లో వ‌న్డే) అందించిన ఏకైక కెప్టెన్ గా కీర్తిగ‌డించాడు మ‌హీ. 2019 ప్ర‌పంచ క‌ప్ లో న్యూజిలాండ్‌తో సెమీఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం ధోని తిరిగి టీమ్ఇండియా జెర్సీ ధ‌రించ‌లేదు. .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story