పాముతో స్కెచ్‌వేసి భార్యను చంపిన భర్త.. పాముకు శవ పరీక్ష

By సుభాష్  Published on  28 May 2020 6:39 AM GMT
పాముతో స్కెచ్‌వేసి భార్యను చంపిన భర్త.. పాముకు శవ పరీక్ష

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఏ పని చేయాలన్నా ఎక్కువగా టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. కానీ మంచి పనులకు టెక్నాలజీని ఉపయోగిస్తే మంచిది.. కొందరు చెడు పనులకు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఇక యూట్యూబ్‌లో మనకు ఎన్నో వీడియోలు లభిస్తుంటాయి. అందులో మంచి ఉంటుంది.. చెడు ఉంటుంది. కానీ చెడు కోసమే ఎక్కువగా ఉయోగిస్తూ కటకటాల పాలవుతున్నారు.

ఓ భర్త భార్యను చంపిన కేసులో సంచలన నిజం బటపడింది. కేసు దర్యాప్తులో కీలక నిజం బట్టబయలైంది. కేరళ రాష్ట్రంలోని కొలంలో ఓ భర్త పాముతో స్కెచ్ వేసి భార్యను చంపిన ఉదంతం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే భర్త హత్య కోసం ఉపయోగించిన పామును బయటకు తీసి శవపరీక్ష చేశారు. కాగా, పాముతో భార్యకు కరిపించి హత్య చేసిన ఘటనపై పాముకు ఈ శవపరీక్ష చేయాల్సి వచ్చింది.

పోలీసులు, అటవీశాఖ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పాము కళేబరాన్ని పాతిపెట్టిన స్థలంను గుర్తించి తవ్వి పామును బయటకు తీశారు. పాము కాటు వల్లే భార్య ఉత్రా మరణించిందని పరీక్షల్లో వెల్లడైందని అధికారులు తెలిపారు. దాదాపు 152 సెంటీమీటర్ల పొడవు ఉన్న పాము ఇప్పటికే కుళ్లిపోయే దశలో ఉందని, అయితే శవ పరీక్షకు అవసరమైన శాంపిల్స్‌ తీసుకోగలిగినట్లు తెలిపారు. పాము కోరలను సైతం నమూనాల కోసం సేకరించినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్‌ సిబ్బంది సేకరించిన శాంపిల్స్‌ తదుపరి పరీక్షకు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తుది రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నట్లు చెప్పారు. కాగా, ఈ హత్య కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో అనే విషయం పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, రెండో పెళ్లి చేసుకోవాలనే అక్రబుద్దితోనే తన భార్య ఉత్రాను పాముతో కరిపించి హత్య చేశారు భర్త సూరజ్‌. యూబ్యూబ్‌లో పాముల ద్వారా ఎలా మనుషులను చంపవచ్చో తెలుసుకుని పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ హత్ చేశాడు. హత్యకు ఉపయోగించిన పాము ను ఇంటి సమీపంలో ఉన్న పెరట్లో పాతిపెట్టాడు. చివరికి భార్యకు పాముతోనే కరిపించి హత్య చేసినట్లు వెల్లడైంది. అలాగే ఫోరెన్సి రిపోర్టులు వస్తే మరికొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది.

Next Story
Share it