బ్రేకింగ్‌: రంగారెడ్డి జిల్లాలో దారుణం: స్టాఫ్‌ నర్సుపై గ్యాంగ్‌ రేప్‌..!

By సుభాష్  Published on  26 May 2020 5:22 PM GMT
బ్రేకింగ్‌: రంగారెడ్డి జిల్లాలో దారుణం: స్టాఫ్‌ నర్సుపై గ్యాంగ్‌ రేప్‌..!

దేశంలో మహిళపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. మానవ మృగాళ్లలో తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో దిశ ఘటన జరిగిన తర్వాత బాలికలపై , మహిళలపై మరెన్నో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా దిశ తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో స్టాఫ్‌ నర్సుపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ప్రియుడు భాను, తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్టాఫ్‌ నర్సుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, నీతో ఒంటరిగా కాలవాలి అంటూ ప్రియుడు బాధితురాలికి ఫోన్‌ చేసి, ఎలికట్ట సమీపంలోని ఓ ఐరన్‌ పరిశ్రమ వెనుక ఉన్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు.

దీంతో ప్రియుడి మాటలు నమ్మి వచ్చిన బాధితురాలిపై ప్రియుడు పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా తన స్నేహితులను అక్కడికి పిలిపించి వారితో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ప్రియుడు అత్యాచారం చేసిన తర్వాత తన స్నేహితుల కోరికను తీర్చాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు ససేమిరా అనడంతో కూల్‌ డ్రింక్ లో మత్తు మందు కలిపి స్నాహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అంతేకాదు బాధితురాలిపై దాడికి దిగారు. ఇక ఎలాగోలా తప్పించుకుని జరిగిన విషయాన్ని కుటుంబీకులకు తెలుపడంతో వారు షాద్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it