న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 23 July 2020 11:18 AM GMTబ్రిటీషర్లను గడగడలాడించిన చంద్రశేఖర్ ఆజాద్
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు, బ్రిటీషర్లకు సింహస్వప్నం చంద్రశేఖర్ ఆజాద్. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ సహచరుడిగా ఉండి బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అన్నదమ్ములు మూడో అంతస్థు నుండి దూకాల్సి వచ్చింది.. కింద ఉన్న వాళ్లు గ్రేట్ బాసూ..!
మూడో అంతస్థు పై నుండి ఇద్దరు అన్నదమ్ములు దూకాల్సి వచ్చింది. అలా దూకిన వాళ్ళను కింద ఉన్న వాళ్లు పట్టుకోవడం విశేషం. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకోగా.. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గ్రెనోబుల్ నగరంలో మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు, 10 సంవత్సరాల వయసు ఉన్న అన్నదమ్ములు లోపలే ఉండిపోయారు. వారి దగ్గర ఎటువంటి తాళాలు లేకపోవడంతో 40 అడుగుల పై నుండి దూకేయాల్సి వచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఐపీఎల్ పై పాక్ క్రికెటర్ల అక్కసు.. తెరపైకి ‘మంకీ గేట్’ వివాదం
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ), క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ)పై తీవ్ర ఆరోపణలు చేశాడు. బిసిసిఐ చెప్పినట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తోందని.. క్రికెట్ బోర్డుల్లో సమానత్వం నశించిందని అన్నాడు. జియో క్రికెట్ కు షోయబ్ అక్తర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిసిసిఐ ఆర్థికంగా చాలా పవర్ ఫుల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారు చెప్పిన పని చేస్తూ ఉందన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
టిక్ టాక్ స్టార్లకు భారీగా డిమాండ్.. కోటి రూపాయల వరకూ సంపాదించవచ్చు..!
టిక్ టాక్ యాప్ ను భారత్ లో బ్యాన్ చేసిన తర్వాత ఆ గ్యాప్ ను పూర్తి చేయడానికి ఎన్నో సంస్థలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. టిక్ టాక్ స్థానాన్ని ఆక్రమించడానికి డజనుకు పైగా యాప్ కంపెనీల మధ్య భారీ పోటీ ఉంది. ఒక కంపెనీ పోవడంతో పది కంపెనీలు పుట్టుకొచ్చాయి. దీంతో పోటీ కూడా అంతే స్థాయిలో ఉంది. ముఖ్యంగా టిక్ టాక్ స్టార్లను కేవలం తమ యాప్ లో మాత్రమే చేయించుకోవాలని భావిస్తూ ఉన్నాయి సదరు కంపెనీలు. కంటెంట్ ను క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు వీడియోలను అప్లోడ్ చేసే వారి వలన యాప్ ను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏవోబీలో తృటిలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్.. తప్పించుకున్న అగ్రనేత ఆర్కే!
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మళ్లీ అలజడి చోటు చేసుకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు.. ఈనెల 19న విశాఖ ఏజన్సీలోని పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘అమ్మా.. డాడీని మరిచిపో.. డాడీ నాకొద్దు.. నెంబర్ డిలీట్ చేయ్..’
అమ్మా డాడీని మరిచిపోమ్మా.. ఈ డాడీ నాకొద్దూ.. డాడీ నెంబర్ డిలీట్ చేయి.. అంటూ ఓ చిన్నారి తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేసింది. నడిరోడ్డుపై కూర్చుని న్యాయం కోసం ఏడుస్తున్న తల్లితో చిన్నారి చెప్పిన మాటలు ఇవి. ఈఘటన తిరుపతి నగరం నడి బొడ్డున జరిగింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దాదా భవితవ్యం తేలేది అప్పుడే..
బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) రాజ్యాంగ సవరణ. అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పొడగింపు సహా మరికొన్ని అంశాల పొడిగింపుపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. బుధవారం స్వల్ప వాదన అనంతరం ఆగస్టు17న (రెండు వారాల అనంతరం) విచారణ చేపడుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాజ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారత్‌లో మరణమృదంగం.. 24 గంటల్లో 1,129 మంది మృతి
భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,129 మంది మృత్యువాత పడగా.. 45,270 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో ఇన్ని కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 29,861 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Fact Check: నిజమెంత: ఆవిరి పీల్చడం ద్వారా కోవిద్-19 ను తరిమేయొచ్చు అని చెబుతూ ఆడియో వైరల్..?
ముంబైకి చెందిన ఓ డాక్టర్ ఆవిరిని పీల్చడం ద్వారా కోవిద్-19ను తరిమేయొచ్చు అని చెబుతున్న ఆడియో ఫైల్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సప్ లో ఈ ఆడియో ఫైల్ ను వైరల్ చేస్తూ ఉన్నారు. ఆవిరి పట్టడం ద్వారా ముక్కుల్లో ఉన్న కరోనా వైరస్ ను చంపేయొచ్చని చెబుతూ ఉన్నారు. పారా-నాసల్ ట్రీట్మెంట్ ఇదని ఆడియోలో చెబుతూ ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తెలంగాణ: గవర్నర్ కోటా స్థానాల కోసం ఆశావహుల ప్రయత్నాలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. 40 మంది ఉన్న మండలిలో.. గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలు ఉంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ అయిపోయాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి