బ్రిటీషర్లను గడగడలాడించిన చంద్రశేఖర్‌ ఆజాద్‌

By సుభాష్  Published on  23 July 2020 9:38 AM GMT
బ్రిటీషర్లను గడగడలాడించిన చంద్రశేఖర్‌ ఆజాద్‌

నేడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ జయంతి

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు, బ్రిటీషర్లకు సింహస్వప్నం చంద్రశేఖర్‌ ఆజాద్‌. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, పండిత్‌ రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ సహచరుడిగా ఉండి బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. ఆజాద్‌ పూర్తి పేరు చంద్రశేఖర సీతారామ్‌ తివారి. ఆజాద్ పండిత్ జీ అని కూడా పిలువబడ్డారు. 1857 తర్వాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటి వారు. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనదిగా బలంగా నమ్మాడు ఆజాద్‌

1931, ఫిబ్రవరి 27న తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌ కు చేరుకోగా, ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో బ్రిటీష్‌ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ లొంగిపోవాలంటూ హెచ్చరించారు. ఆయనా కూడా ధైర్యంతో వారి హెచ్చరికలను సైతం ఖతరు చేయలేదు. మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్‌ సీతారామ్‌ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్‌ ఆజాద్‌ జన్మించారు.

పదేహేనేళ్ల ప్రాయంలోనే అరెస్ట్‌

కాగా, ఆజాద్‌ సొంత గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్‌ సెకండరీ విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి హనుమాన్‌ భక్తుడిగా ఉండేవారు.

1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌ వాలాబాద్‌ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ఆ తర్వాత 1921లో గాంధీజీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికి పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టు అయ్యారు. అయితే విచారణ సందర్భంగా కోర్టులో ఆజాద్‌ను హాజరు పర్చగా, 'నీ పేరేంటి?' అని జడ్జి అడుగగా, పెద్ద శబ్ధంతో 'ఆజాద్‌' అని అరిచి చెప్పాడు. దాంతో జడ్జి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్‌ మాతాకీ జై అంటూ గట్టిగా నినదించారు. అప్పటి నుంచి చంద్రశేఖర్‌ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

నా వద్ద తుపాకీ ఉన్నంత కాలం నన్నెవ్వరూ సజీవంగా పట్టుకోలేరు.. అని ఒక సందర్భంలో తెలిపిన ఆజాద్‌.. చవడానికైనా సిద్ధం అయ్యాడు. కానీ లొంగిపోవడానికి సిద్ధం కాలేదు. అందుకే వెంటనే తన వద్ద ఉన్న గన్‌తోతలకు ఎక్కుపెట్టుకుని భారత్‌ మాత కోసం ప్రాణాలు అర్పించి ప్రజల జ్ఞాపకాలలో అమరుడయ్యారు.

Next Story