పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులు మతం అడిగి చంపారని, మనం కర్మ ఆధారంగా చంపేశామని అన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదర్శ్ డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మతం అడిగి ప్రజలను చంపారని.. మన సైనికులు ఉగ్రవాదులను మతం ఆధారంగా కాకుండా వారి చర్యల ఆధారంగా చంపారని అన్నారు.
పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. దీని తర్వాత పాకిస్థాన్ భారత్ వైపు పలు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ.. రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్‌లో మన సైన్యం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చింది, లక్ష్యంపై ఖచ్చితంగా దాడి చేసిందన్నారు.