HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

హర్యానా యమునా నగర్‌ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 14 April 2025 3:21 PM IST

National News, Pm Modi, Congress, Bjp, Congress Ruling States, Telangana, Karnataka, Himachalpradesh

HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

హర్యానా యమునా నగర్‌ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌సీయూ కంచ గచ్చబౌలి భూములపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. చెత్త నుంచి మంచి పనులు చేయాలని బీజేపీ చూస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది...అని మోడీ విమర్శించారు.

అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనలో అభివృద్ధి కుంటుపడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ పని చేస్తుంది..అని ప్రధాని మోడీ అన్నారు.

Next Story