హైదరాబాద్: ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తూ 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చలో బస్ భవన్ కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావు సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారు. నందినగర్ నుంచి కేటీఆర్.. మెహిదీపట్నం నుంచి హరీష్ రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్ చేరుకుంటారు. పెంచిన బస్సు చార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే.. వాళ్ళ కుటుంబ సభ్యలపై బారం వేయడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధి కోల్పోయిన వారి సంఖ్యనే ఎక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పింది. .అని తలసాని పేర్కొన్నారు.
గౌలిగూడ బస్ డిపోను 400కోట్లకు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చారు. మియాపూర్, ఉప్పల్ సహా.. వివిధ డిపోలను ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి కార్మికులను ముంచాలని చూస్తున్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతిస్తున్నాం. కానీ ఆర్టీసీ డ్రైవర్లతోనే ఎలక్ట్రిక్ బస్సులను నడపాలి. ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి ఆర్టీసీ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలి..అని తలసాని శ్రీనివాస్ తెలిపారు.