న్యూస్‌మీటర్.. టాప్ 10 న్యూస్
By Medi Samrat Published on 19 Nov 2019 7:15 PM IST1. ఏపీ మందుబాబులకు మరిన్ని కష్టాలు..!
బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బార్ల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికే మద్యం దుకాణాలను 20 శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సుదీర్ఘ చర్చల తర్వాత బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. బార్లలో మద్యం సరఫరా వేళలను మార్పు చేయనున్నారు. బార్లలో మద్యం సరఫరాకు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, ఆహారం రాత్రి 11 వరకూ.. స్టార్ హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకూ మద్యం అనుమతి ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
2. వారిని అడ్డుకునే అధికారం మీకు ఎవరిచ్చారు.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు(జన సైనికులకు) బాసటగా నిలిచాడు. అక్రమ కేసులతో పీడింపబడుతున్న వారి పక్షాన నిలబడ్డాడు. గ్రామ తిరునాళ్లలో నాటకం ప్రదర్శిస్తున్న జనసైనికులను అడ్డుకున్న పోలీసు అధికారి తీరును ఎండగట్టాడు. ఈ మేరకు జనసేనాని ఓ లేఖను విడుదల చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
3. విడుదలకు ముందే కాకరేపుతోన్న ‘జార్జి రెడ్డి’..!
నవంబర్22న ‘జార్జిరెడ్డి’ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యే సంచలనం సృష్టిస్తోంది. సంచలన డైరక్టర్ వర్మ కూడా సినిమా అదిరిపోయిందని ట్విట్ చేశాడు. బహూశ ‘జార్జిరెడ్డి’ సినిమా చూస్తుంటే వర్మకు ‘శివ’ సినిమా మదిలో మెదిలి ఉంటుంది. విద్యార్ధుల గొడవలు, క్యాంపస్‌లో ఆధిపత్య పోరు, రాజకీయ పార్టీల ప్రవేశం క్యాంపస్‌ల్లో సహజంగా జరుగుతుండేవే. అయితే..1970ల్లో ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన విద్యార్ది పోరు రక్త చరిత్రగా హిస్టరీలో మిగిలిపోయింది. అదే..ఇతివృత్తంగా ‘జార్జిరెడ్డి’ పేరుతో తెర ఎక్కించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
4. ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతూ పాక్ సరిహద్దు దాటాడు… ఆ తర్వాత ఏమైందటే..?
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో ఈ నెల 14న ఇద్దరు భారతీయులను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్. మరోకరు మధ్యప్రదేశ్‌కు చెందిన హరిలాల్ ఉన్నారు. ప్రశాంత్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రశాంత్ బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ప్రశాంత్ పాక్ సరిహద్దులు దాటినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్‌లోని చోలిస్తాన్ ఎడారిలో ప్రవేశించే ప్రయత్నం చేయడంతో బహావల్‌పూర్ వద్ద వీరిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
5. జీ తెలుగుకు జబర్దస్త్ షిప్ట్ ! మల్లెమాల తెర వెనుక అసలేం జరిగింది?
ఔను మీరు విన్నది నిజమే .. జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకున్నాడు. ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో మాత్రమే నాగబాబు కనిపిస్తారు. ఈ ఆదివారం నుంచి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సరికొత్త ఎపిసోడ్ లో నాగబాబు కనిపించనున్నారు. ఇంతకు నాగబాబు జబర్దస్త్ కు ఎందుకు బై బై చెప్పారు. ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే.. మనం ఓ వారం వెనక్కి వెళ్ళాలి. అసలు జబర్దస్త్ హిట్ కావడానికి బ్యాక్ బోన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ డైరెక్షన్ టీం మెయిన్ క్యాండిడేట్స్ నితిన్ -భరత్ జోడిని జీ తెలుగు లాగేసుకుంది. చాల హెవీ అమౌంట్‌తో నితిన్ -భరత్ ను ఆ ఛానల్ తీసుకుందని తెలిసింది. ఇక్కడే అసలు ఆట మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6. కొడుకును కనకపోవడం ఆమె తప్పా..? తలాక్ చెప్పాడు..!
కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చినా.. ముస్లిం మహిళల కష్టాలు మాత్రం తీరడం లేదు. అర్థం లేని కారణాలు చెబుతూ భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలిపెడుతున్నారు. భార్యకు ఎత్తు పళ్లు ఉన్నాయంటూ పెళ్లయిన నాలుగు నెలల్లోనే భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. కొడుకును కని ఇవ్వలేదని ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో బాధిత భార్య మోహ్‌రాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కొడుకును కని ఇవ్వలేదని అందుకే నాకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తాను మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి యత్నిస్తున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
7. అతనిపై నిషేధం ఏడాది కాదు.. ఐదేళ్లు.!
మైదానంలో తోటి క్రికెటర్‌పై దాడికి పాల్పడ్డ బంగ్లాదేశ్ క్రికెటర్ షహదాత్ హుస్సేన్ ఏడాది పాటు నిషేదానికి గురయ్యాడు అంటూ సోమవారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై విధించిన నిషేదం ఏడాది కాదు.. ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందులో రెండేళ్లు సస్పెండ్ చేసింది. ఐదు సంవత్సరాలతో పాటు నిషేధంతో పాటు మూడు లక్షల టాకాల జరిమానా కూడా విధించింది. అయితే ఈ నిషేధాన్ని అంగీకరిస్తున్నట్లు షహదత్ హుస్సేన్ ప్రకటించాడు. ఈ శిక్షను మ్యాచ్ రిఫరీ విధించి.. ఆ తర్వాత పరిశీలన నిమిత్తం బోర్డు టెక్నికల్ కమిటీకి పంపించారు. బోర్డు.. ఆటగాడికి నిషేధం, జరిమానా విధించడాన్ని సమర్థించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
8. గన్నవరం పంచాయితీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా…?
15 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గన్నవరం పంచాయితీ పొలిటికల్ హీట్ పుట్టించింది. గన్నవరం పంచాయితీలో డైరక్ట్‌గా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా కల్పించుకున్నారు. వైఎస్ఆర్ సీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావ్ , ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. యార్లగడ్డ వెంకట్రావ్ వర్గీయులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. దీంతో ..వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ జగన్‌ను కలిశారు. వంశీ పార్టీలోకి రావడం వలన రాజకీయంగా మీ భవిష్యత్తుకు నష్టం ఏం ఉండదని వెంకట్రావ్‌కు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. వెంకట్రావ్‌కు రాజకీయ భవిష్యత్తపై జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ..యార్లగడ్డ వెంకట్రావ్ మెత్తబడినట్లు తెలుస్తోంది.సీఎం వైఎస్ జగన్ తో సమావేశం తరువాత పేర్ని నాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావ్ ఒకే కారులో వెళ్లారు. గన్నవరం పంచాయితీకి తెరపడటంతో గన్నవరం వైఎస్ఆర్ సీపీ శ్రేణులతోపాటు, కృష్ణా జిల్లా నేతలూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
9. ఎమ్మెల్యే సామాజికవర్గంపై విచారణ..!!
తాడికొండ వైఎస్‌ఆర్ సీపీ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి పై ఈ రోజు విచారణ జరగనుంది. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ గుంటూరు జిల్లా జేసీ కి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాను ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు వెంట తెచ్చుకోవచ్చని శ్రీదేవికి జేసీ చెప్పారు. బంధువులను కూడా విచారణకు తీసుకురావచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
10. జమ్మూఫూంచ్ హైవేపై ఐఈడీ కలకలం..!
భారత్ లో ఉగ్రవాదులు తీవ్ర ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లుంది. ఇప్పటికే 75 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారనే సమాచారంతో నిఘా సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే..జమ్ముపూంచ్ హైవేపై కిలోల కొద్దీ ఐఈడీని భద్రతా బలగాలు కనుగొన్నాయి. స్పాట్‌కు బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. ఎటువంటి ప్రమాదం లేకుండా ఐఈడీని నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం జమ్ము,పూంచ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. రహదారిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..