అమరావతి: తాడికొండ వైఎస్‌ఆర్ సీపీ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి పై ఈ రోజు విచారణ జరగనుంది. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ గుంటూరు జిల్లా జేసీ కి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాను ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు వెంట తెచ్చుకోవచ్చని శ్రీదేవికి జేసీ చెప్పారు. బంధువులను కూడా విచారణకు తీసుకురావచ్చని జాయింట్ కలెక్టర్‌ తెలిపారు.Sri

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.