అమరావతి: తాడికొండ వైఎస్‌ఆర్ సీపీ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి పై ఈ రోజు విచారణ జరగనుంది. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ గుంటూరు జిల్లా జేసీ కి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాను ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు వెంట తెచ్చుకోవచ్చని శ్రీదేవికి జేసీ చెప్పారు. బంధువులను కూడా విచారణకు తీసుకురావచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.