తెలంగాణలో రానున్న ఐదు రోజులు వ‌ర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది

By Medi Samrat
Published on : 22 May 2024 10:07 AM IST

తెలంగాణలో రానున్న ఐదు రోజులు వ‌ర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. ఈ మేర‌కు వాతావరణ శాఖ మే 26 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

రేపు తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది.

మే 24న కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

కామారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్‌లో శనివారం వర్షం పడే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

ఆదివారం సంగారెడ్డి, మెదక్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలావుంటే.. జూన్ 6 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

Next Story