ఉగ్రరూపం దాల్చుతోన్న గోదావరి.. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి సహా హైదరాబాద్‌లో జోరు వానలు పడుతున్నాయి.
By అంజి
ఉగ్రరూపం దాల్చుతోన్న గోదావరి.. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి సహా హైదరాబాద్‌లో జోరు వానలు పడుతున్నాయి. గత 4 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళ, రేపు కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు ఏపీలోని రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 కాల్ చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశాలిచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 32.2 అడుగుల నీటిమట్టం ఉంది. కూనవరం వద్ద నీటిమట్టం 12. 26 మీటర్లు, పోలవరం వద్ద 8.19మీటర్లు ఉండగా.. ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక/లంకగ్రామ/ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
🔺గోదావరి పెరుగుతున్న వరద ఉధృతి 🔺భద్రాచలం వద్ద ప్రస్తుతం 32.2 అడుగుల నీటిమట్టం 🔺కూనవరం వద్ద నీటిమట్టం 12. 26 మీటర్లు 🔺పోలవరం వద్ద 8.19మీటర్లు 🔺ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులు 🔺గోదావరి పరివాహక/లంకగ్రామ/ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి pic.twitter.com/T42ZeE59JY
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 26, 2025