ఆ అవకాశం మీకొస్తే ఎవరిని ఎంచుకుంటారు.. విరాట్‌నా.. జడ్డూనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 May 2020 10:26 AM ISTప్రస్తుతం టీమిండియా క్రికెట్ జట్టులో మంచి ఆటగాళ్లకు కొదువలేదు. తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గొలిపిస్తారు. అన్ని వనరులతో జట్టు ఎప్పుడు సమతూకంగా ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో దూకుడు ప్రదర్శించే ఆటగాళ్లే ఉన్నారు. అయితే.. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లు అప్పుడప్పుడు కాస్తా తడబడతారనే చెప్పాలి.
ఒకప్పుడు అజయ్ జడేజా, రాబిన్ సింగ్.. నిన్నటి తరంలో మహ్మద్ కైప్, యువరాజ్ సింగ్‌ల వంటి గొప్ప ఫీల్డర్లను కలిగిన భారత జట్టులో నేడు.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వంటి ఉత్తమ ఫీల్డర్లు ఉన్నారు. అలాగే అడపాదడపా కొత్త కుర్రాళ్లు కూడా ఇరగదీస్తున్నారు. అయితే.. ప్రముఖ స్పోర్స్ చానల్ స్టార్‌సోర్ట్స్ ఇండియా తన ఇన్‌స్టా గ్రాం అకౌంట్‌లో 'ఒకవేళ మీకు అవకాశమిస్తే డైరెక్ట్ త్రో ద్వారా స్టంప్స్‌ను ఎగురగొట్టడంలో విరాట్ లేదా జడేజాలో ఎవరిని ఏంచుకుంటారని' అని ప్రశ్నించింది.
అయితే ఈ విషయమై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెంటనే స్పందించాడు. ఏ మాత్రం సందేహం లేదు.. జడ్డూనే ప్రతీసారి అత్యుత్తమ ఫీల్డర్ అంటూ కితాబిచ్చాడు. అంతేకాదు.. ఈ చర్చను ఇక్కడితో వదిలేద్దాం అంటూ విరాట్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇదే ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందించారు. కొంతమంది విరాట్ ఉత్తమ ఫీల్డర్ అంటే.. మరికొంత మంది మాత్రం 'సర్ జడేజా.. జడ్డూ' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.