న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  26 Jun 2020 4:32 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

ఏపీలో తెలంగాణ పోలీస్‌ వాహనం తనిఖీ.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్‌..!

ప్రస్తుతం ఉన్న సాంకేతికను మంచితనానికి ఉపయోగించుకోకుండా మోసాలకు ఉపయోగించుకునే వారు ఎక్కువై పోతున్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో మోసాలకు అంతే లేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తాజాగా విజయవాడలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి చేసిన మోసం బట్టబయలైంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆగస్ట్‌ 12 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12 వరకు మెయిల్‌, ఎక్స్‌ ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్లు వంటి రెగ్యులర్‌ ప్రయాణికుల సర్వేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 12 మధ్య బుక్‌ చేసుకున్న రైల్వేటికెట్లన్ని రద్దవుతాయని వెల్లడించింది. టికెట్లు రద్దయిన వారందరికి రీఫండ్‌ చేయనున్నట్లు తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒసామా బిన్‌ లాడెన్ అమ‌ర‌వీరుడు.. ఇమ్రాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉగ్ర‌వాద సంస్థ‌ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్‌ను.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించారు. పాక్‌ పార్లమెంట్‌లో మాట్లాడిన‌ ఇమ్రాన్.. అమెరికా సైన్యం అబోటాబాద్ వచ్చి బిన్ లాడెన్‌ను చంపారు.. అదే అమరుడిని చేశార‌ని వ్యాఖ్యానించారు. మొదట బిన్ లాడెన్‌ను చంపార‌న్న‌ ఇమ్రాన్.. వెంటనే అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇమ్రాన్ వ్యాఖ్య‌లు విస్తృత ప్ర‌‌చారంలో ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జమ్మూ: భారత ఆర్మీ కాల్పుల్లో ఇప్పటి వరకూ 108 మంది ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో తుపాకుల మోతతో భీకరమైన వాతావరణం నెలకొంటోంది. రోజురోజుకు ఉగ్రవాదులు రెచ్చిపోవడాలు పెరిగిపోతుండటంతో భారత సైన్యం అప్రమత్తమై వారి కాల్పులను తిప్పికొడుతున్నాయి. భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారంలో బలగాలు ముందస్తుగా అప్రమత్తమవుతూ వస్తున్నాయి. ఒక వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో అతలాకుతలం .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

శాంపిళ్ల సేకరణ ఆపటం వెనుక అసలు కారణం అదేనా?

మరో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సాధించాలని ఫిక్స్ అయ్యారు. అలాంటప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? పెట్టుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తగినన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది చెక్ చేసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తే.. అలాంటి పక్కా ప్లానింగ్ ఏదీ ఉన్నట్లు కనిపించట్లేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారీగా పడిపోయిన బంగారం ధర

బంగారం ప్రియులకు ఇది శుభవార్తే. రోజురోజుకు పెరుగుతూ వచ్చిన పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక బంగారం ధర తగ్గితే, వెండి కూడా అదే దారిలో వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీయంగా ధర దిగివచ్చింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరో రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్రం.. తర్వాత లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రతరం అయ్యాయి. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా అస్సాంలోని గౌహతి నగరంలో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మాహిష్మతిలోనూ మాస్కులు కంపల్సరీ.. వీడియో వైరల్‌

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 97 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దాదాపు 5లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే శానిటైజర్లు, మాస్కులు .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సుశాంత్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఎంత మంచివాడో.. అతడిలో ఎన్ని విభిన్న కోణాలు ఉన్నాయో.. అతను చనిపోయాకే ఎక్కువగా తెలుస్తోంది. చనిపోవడానికి ముందు సుశాంత్ మంచి నటుడు మాత్రమే. కానీ ఇప్పుడు అతను గొప్ప వ్యక్తి అనే సంగతి ఎంతోమంది ఉదాహరణల ద్వారా తెలియజేస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కాఫీ తాగుతుంటే పాక్‌ అభిమాని తిట్టడం మొదలుపెట్టాడు

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ జరిగే ముందు జరిగిన ఘటనలను బయటపెట్టాడు. మాంచెస్టర్ తో వరల్డ్ కప్ మ్యాచ్ కు ముందు తమను పాకిస్థాన్ అభిమానులు తిట్టారని చెప్పుకొచ్చాడు.

భారత్ ఆర్మీ పోడ్ కాస్ట్ కు శంకర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story