గౌహతిలో మరో రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  26 Jun 2020 9:19 AM GMT
గౌహతిలో మరో రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్రం.. తర్వాత లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రతరం అయ్యాయి. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా అస్సాంలోని గౌహతి నగరంలో మరో రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. జూన్ 28 నుంచి జులై 12వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. అలాగే రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలి

కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని, చివరకు కిరాణ, కూరగాయల దుకాణాలు సైతం తెరుచుకునేందుకు అవకాశం లేదని మంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. వారం రోజుల తర్వాత సమీక్ష చేసి, ఆ తర్వాత లాక్‌డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటి వరకు కఠిన ఆంక్షలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘించినట్లు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇలా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొరలు చాస్తుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించడం తప్పనిసరి అంటున్నారు పలువురు మేధావులు. లాక్‌డౌన్‌ సడలింపుల వల్ల దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని, వైరస్‌కు వ్యాక్సిన్‌ లేని కారణంగా భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించినా.. ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే తప్ప కరోనా కట్టడిలోకి రాదని చెబుతున్నారు. ఇప్పటికే దేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు.Next Story