జులై 31 వరకూ లాక్ డౌన్.. స్కూల్స్, కాలేజీలు బంద్..!

By సుభాష్  Published on  25 Jun 2020 5:12 AM GMT
జులై 31 వరకూ లాక్ డౌన్.. స్కూల్స్, కాలేజీలు బంద్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపారు. మూడు గంటల పాటూ సాగిన ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం మమతా బెనర్జీ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కోవిద్-19 వ్యాప్తి ఎక్కువవుతోందని.. ఇలాగే కొనసాగితే మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని.. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి జులై 31 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని అన్నారు. కాలేజీలు, స్కూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయబడవని ఆమె తెలిపారు.

జూన్ 24 న అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం కరోనా కేసులు 15173 నమోదయ్యాయి. 4890 మంది కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. 591 మంది మరణించారు.

కరోనా లేని వ్యక్తులు వేరే రోగంతో ఆసుపత్రుల్లోకి వెళ్లాలంటే చాలా కష్టమవుతోంది. అలాంటి వారికి వేరే ఏర్పాట్లు చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం భావిస్తోంది. ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా వీరి గురించి మాట్లాడామని మమతా తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ అధికారులకు సూచించారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్స్ ఇచ్చేలా చేయాలని చూడాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు దీన్ని బిజినెస్ లాగా చూడకూడదని ఆమె సూచించారు.

Next Story