న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  25 Jun 2020 10:56 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

హిందూ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్‌ రూ.10 కోట్లు కేటాయింపు

హిందువులకు పవిత్ర దేవాలయమైన శ్రీకృష్ణుడికి పాకిస్థాన్‌లో ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మాణం కానుంది. ఈ ఆలయానికి పాక్‌ ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించనుంది. నిధులు కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీలపై తీవ్ర స్థాయిలో వివక్ష చూపించే పాక్‌.. ఓ మంచి కార్యానికి పునాది వేస్తోందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రూ. 68వేలకు బంగారం.. ఎప్పుడంటే..!

ప్రస్తుతం పసిడి ధరలపైనే అందరి దృష్టి. బంగారం ధరలు ప్రతి రోజు బంగారం ప్రియులకు షాకిస్తూనే ఉన్నాయి. ఒకరోజు తగ్గితే వారం రోజులపాటు ధరలు పెడుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు అంటేనే వినియోగదారులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నతగ్గిన బంగారం ధరలు.. ఈరోజు మళ్ళీ పెరిగాయి. ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల పసిడి ప్రయులకు టెన్షన్‌ పుట్టిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితులు, సంస్థల ప్రతికూల .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జబర్దస్త్‌ నుంచి ఆ రెండు టీమ్‌లు ఔట్‌..!

జబర్దస్త్‌ షో.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ పొందింది. తాజాగా ఈ షోలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎంతో రేటింగ్‌ ఉన్న ఈ షోకు.. సరైన సరైన ప్రదర్శననిచ్చే టీమ్‌లను సైతం మల్లెమాల తొలగించేస్తోంది. అసలే లాక్‌డౌన్‌ కారణంగా పాత షోలతో నడిపిస్తున్న మల్లెమాల.. రేటింగ్‌లో సైతం వెనుకబడిపోయింది. షూటింగ్‌లు లేక పాత.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్

టాలీవుడ్‌ నటి, ఢీ షో జడ్జి పూర్ణ ( శ్యామ్నా కాసిం)కు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. పూర్ణ అసలు పేరు శ్యామ్నా కాసిం. ఆమెది కేరళ. తెలుగులో ప్రసారమయ్య ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా కేరళలోనే ఉండిపోయింది. అయితే ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా నలుగురు బెదిరింపులకు పాల్పడుతున్నారట. భారీ మొత్తంలో డబ్బులు .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కవిత రీఎంట్రీ.. తెలంగాణలో మరో ఉద్యమం?

కొన్ని విషయాల్ని చూసినప్పుడు భలే ఆశ్చర్యంగానూ.. ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. సుదీర్ఘ ఉద్యమం తర్వాత ఏదైనా సాధించినప్పుడు.. అక్కడ భావస్వేచ్ఛ అద్భుతంగా ఉంటుందని భావిస్తారు ఎవరైనా. ఎందుకంటే.. ఇప్పుడున్న కాలంలో ఉద్యమాలు నిర్మించటం.. దాన్ని శాంతియుతంగా సాగేలా చేయటం.. అంతిమంగా అనుకున్నది చేయటం మామూలు విషయం కాదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..

ప్రతి మనిషి ద్రవ రూపంలో ఏదైనా తాగితే అది మూత్రశయంలోకి చేరుతుంది. అది నిండగానే మనకు మూత్రం పోయాలన్న సంకేతాలు మెదడుకు అందుతాయి. కానీ చైనాలో ఓ వ్యక్తి పది బీర్లను తాగి హాయిగా నిద్రపోయాడు. లేచేసరికి మూత్రశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలో బయటపడ్డాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.!

తెలంగాణ హోమ్ మినిస్టర్ మోహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నలుగురికి పాజిటివ్ అంటూ రెండు రోజుల కిందట రిపోర్టులు వచ్చాయి. బుధవారం నాడు మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. మొత్తం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వీరందరినీ ఐసొలేషన్ లో ఉంచారు. మినిస్టర్ టెస్టు రిజల్ట్స్ రావాల్సి ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జులై 31 వరకూ లాక్ డౌన్.. స్కూల్స్, కాలేజీలు బంద్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపారు. మూడు గంటల పాటూ సాగిన ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం మమతా బెనర్జీ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కోవిద్-19 వ్యాప్తి ఎక్కువవుతోందని.. ఇలాగే కొనసాగితే మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని.. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏటీఎం వాడకం.. రానున్న రోజుల్లో వణుకు తెప్పిస్తుందా?

బాగా జరిగిపోతున్న వాటిని కెలకటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. కానీ.. కొన్నిసార్లు ఏదో చేయబోయి.. మరేదో చేయటం.. చివరకు వ్యవహారం రచ్చగా మారటం చూస్తుంటాం. తాజాగా అలాంటి పనే ఆర్ బీఐ ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఇదే పని చేయనుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఏటీఎంలు సాధారణ ప్రజానీకం జీవితంలో భాగమయ్యాక.. దాని వాడకం మీద పరిమితులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జీజీహెచ్‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా

గుంటూరులోని జీజీహెచ్‌ వద్ద అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు స్కామ్‌లో అరెస్టు అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా.. రాత్రి అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రికి చేరుకున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story
Share it