ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్

By సుభాష్  Published on  25 Jun 2020 5:38 AM GMT
ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్

టాలీవుడ్‌ నటి, ఢీ షో జడ్జి పూర్ణ ( శ్యామ్నా కాసిం)కు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. పూర్ణ అసలు పేరు శ్యామ్నా కాసిం. ఆమెది కేరళ. తెలుగులో ప్రసారమయ్య ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా కేరళలోనే ఉండిపోయింది. అయితే ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా నలుగురు బెదిరింపులకు పాల్పడుతున్నారట. భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో పూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చి, అనంతరం నలుగురిని రిమాండ్‌కు తరలించారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన పూర్ణ.. ప్రస్తుతం సొంత భాష అయిన మలయాళం ఇండస్ట్రీపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పలు సినిమాకుల ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

తెలుగులో స్వర్గీయ నటుడు శ్రీహరి హీరోగా నటించిన శ్రీమహాలక్ష్మీ అనే చిత్రంతో పూర్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈమె తెలుగులో అవును, అవును-2, జయమ్ము నిశ్చయమ్మురా, సీమటపాకాయ్‌ తదితర చిత్రాల్లో నటించారు.

Next Story
Share it