జబర్దస్త్‌ నుంచి ఆ రెండు టీమ్‌లు ఔట్‌..!

By సుభాష్  Published on  25 Jun 2020 3:40 AM GMT
జబర్దస్త్‌ నుంచి ఆ రెండు టీమ్‌లు ఔట్‌..!

జబర్దస్త్‌ షో.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ పొందింది. తాజాగా ఈ షోలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎంతో రేటింగ్‌ ఉన్న ఈ షోకు.. సరైన సరైన ప్రదర్శననిచ్చే టీమ్‌లను సైతం మల్లెమాల తొలగించేస్తోంది. అసలే లాక్‌డౌన్‌ కారణంగా పాత షోలతో నడిపిస్తున్న మల్లెమాల.. రేటింగ్‌లో సైతం వెనుకబడిపోయింది. షూటింగ్‌లు లేక పాత షోలతోనే కాలం గడుపుతున్న రోజులివి. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలు కావడంతో కొత్త షోలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా వస్తున్న ప్రోమోలు చూసిన తర్వాత జబర్దస్త్‌ లో చాలా మార్పులు వచ్చాయని తెలుస్తోంది.

ఇంతకు ముందు షోలో నటించిన ఫసక్‌ శశితో పాటు జీవన్‌ టీమ్‌లు కనిపించడం లేదు. ఆ రెండు టీమ్స్‌లతో పాటు మరో రెండు టీమ్‌లను కూడా జబర్దస్త్‌ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది మల్లెమాల. పాతవాళ్లనే తీసుకుని కొత్త అవకాశం ఇచ్చింది. ఒకప్పుడు జబర్దస్త్‌ కామెడీ షోతోనే కావాల్సినంత పేరు తెచ్చుకున్న షకలక శంకర్‌ మళ్లీ వచ్చేశాడు. మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు ముందుకొచ్చాడు. ఆయనతో పాటు షేకింగ్‌ శేషు కూడా మరోసారి జబర్దస్త్‌ షోలో కనిపించనున్నాడు.

ఇక టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఉన్న తాగుబోతు రమేష్‌ సైతం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ జబర్తస్త్‌ వైపు వచ్చేశాడు. ఇక ముందే రేటింగ్‌లో వెనుకబడి ఉన్న జబర్తస్‌ షోలో కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందోననే ఉద్దేశంతో పాత వారినే మళ్లీ షోలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో వెనుకబడిపోయామని, రేటింగ్ విషయంలో కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది మల్లెమాల. ఏ టీమ్‌తోనైనా సరైన రేటింగ్‌ రాకుంటే వారిని నిర్ధాక్షణ్యంగా పక్కనపెట్టేందుకు సిద్ధమైంది మల్లెమాల. అందుకే టీమ్‌ లీడర్స్‌ కూడా తామేమి తక్కువ కాదన్నట్లు అనిపించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జబర్తస్త్‌ షోలో ఈ మార్పులతోనే కాకుండా మరికొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి. తాజాగా షూటింగ్‌లో మొదలు కావడంతో ఓ ప్రముఖ ఛానల్‌కు సంబంధించిన సీరియల్‌ షూటింగ్‌లో ఒకరిద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో షూటింగ్‌లు నిలిపివేశారు. ఇలా కరోనా వైరస్‌ రోజురోజుకు ఎక్కువ కావడంతో మళ్లీ ఏ క్షణంలోనైనా షూటింగ్‌లు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Next Story