తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.!

By Medi Samrat  Published on  25 Jun 2020 8:48 AM GMT
తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా.!

తెలంగాణ హోమ్ మినిస్టర్ మోహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నలుగురికి పాజిటివ్ అంటూ రెండు రోజుల కిందట రిపోర్టులు వచ్చాయి. బుధవారం నాడు మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. మొత్తం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వీరందరినీ ఐసొలేషన్ లో ఉంచారు. మినిస్టర్ టెస్టు రిజల్ట్స్ రావాల్సి ఉంది. వీరికి ఇన్ఫెక్షన్ ఎక్కడ సోకిందో తెలుసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మోహమూద్ అలీ ఇంటికి వెళ్లిన ఓ సంద‌ర్శ‌కుడి కారణంగా వైరస్ సోకి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఓల్డ్ సిటీలోని మోహమూద్ అలీ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న నలుగురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి టెస్టులు చేశారు. రిపోర్టుల్లో ఆ నలుగురికీ వైరస్ సోకినట్లు తెలిసింది. దీంతో మిగిలిన వారందరికీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా టెస్టులు చేశారు. వారిలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది.

హిమాయత్ సాగర్ లోని RBVRR తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడెమీలో 40 మంది అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలోని 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

Next Story