10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..

By సుభాష్  Published on  25 Jun 2020 8:19 AM GMT
10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..

ప్రతి మనిషి ద్రవ రూపంలో ఏదైనా తాగితే అది మూత్రశయంలోకి చేరుతుంది. అది నిండగానే మనకు మూత్రం పోయాలన్న సంకేతాలు మెదడుకు అందుతాయి. కానీ చైనాలో ఓ వ్యక్తి పది బీర్లను తాగి హాయిగా నిద్రపోయాడు. లేచేసరికి మూత్రశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలో బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 40 ఏళ్ల హూ అనే వ్యక్తి ఇటీవల రాత్రి ఓ బార్‌లో 10 బీర్లను తాగేసి ఇంటికెళ్లి పడుకున్నాడు. 18 గంటల తర్వాత నిద్ర లేచిన అతడికి తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతని మూత్రాశయం మూడు చోట్ల పగిలి ద్రవం మొత్తం కడుపులోకి చేరిందని గుర్తించారు. వెంటనే అతనికి శస్త్ర చికిత్స నిర్వహించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే హూ పడుకునే ముందు మూత్రానికి వెళ్లలేదని, బీర్లు తాగడం వల్ల ఆల్కాహాల్‌ నాడీ వ్యవస్థను మొద్దుబారేలా చేయడంతో అతనికి మూత్రం వెళ్లాలన్న సంకేతం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడని, లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. ఇది చదవండి: ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్

ఇలాంటి ఘటనలు చాలా అరుదు

కాగా, ఇలాంటి ఘటనలు చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు. మనిషి ఎంత నీరు తాగితే దానికి తగ్గట్లుగా మూత్రశయ పరిమాణం పెరుగుతుందని, దాని గరిష్ట పరిమితి 450 నుంచి 500 మిల్లీ లీటర్లు మాత్రమేనని, అంతకు మించినట్లయితే మూత్రశయం పగిలిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. అందుకు తరచూ మాత్ర విసర్జన చేయండి అంటూ వైద్యులు సూచిస్తున్నారు.

మూత్రం వస్తుంటే ఆపుకోవద్దు..

కొందరు మూత్రం వస్తుంటే వెళ్లేందుకు బద్దకంగా ఉండి అలానే ఉండిపోతుంటారు. అలా ఉండిపోయినట్లయితే మూత్రశయంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో కూడా మూత్రం వెళ్లేందుకు సంకేతాలు వస్తున్నా.. కొందరు లేచేందుకు బద్దకిస్తుంటారు. అలా చేయకుండా వెంటనే మూత్ర విసర్జన చేసి పడుకోవాలని, లేకపోతే మూత్రాశయంలో మున్ముందుకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్య ఎక్కువగా బీర్లు తాగిన వారిలో వస్తుందని, ఎందుకంటే వారికి ఆల్కాహాల్‌ కారణంగా గాఢ నిద్రలో ఉండటం వల్ల ఒకనొక సమయంలో మూత్రం వెళ్లేందుకు మెదడుకు సంకేతాలు అందకపోవచ్చని, ఒక వేళ సంకేతాలు అందినా మత్తులో ఉండటం వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారని తెలిపారు. అందుకే సమయానికి మూత్ర విసర్జన చేయాలంటున్నారు వైద్య నిపుణులు. ఇది చదవండి: జబర్దస్త్‌ నుంచి ఆ రెండు టీమ్‌లు ఔట్‌..!

Next Story