న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 12 July 2020 12:22 PM GMTముదురుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య రాద్దాంతం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహాట్ వర్గం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మాస్క్ లు ధరించేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న పొరపాట్లు ఇవే..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే కరోనా వైరస్ వల్ల మాస్క్ లు ధరించడం తప్పనిసరి. కొందరు ధరించినా.. మరి కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాస్క్ లు ధరించడంపై సరైన అవగాహన లేకపోవడం, మాస్క్ ను నిమిషానికోసారి తడుముకోవడం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు పెట్టుకున్న మాస్క్ ను ముక్కు కిందికి లాగడం, ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దాదా కష్టపడితే.. ధోని ప్రతిఫలం పొందాడు : గంభీర్
భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన సారధులలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. భారత్‌కు రెండు ప్రపంచకప్(2007 టీ20, 2011 వన్డే) లు అందించడంతో పాటు ఐసీసీ చాంఫియన్స్‌ను టోప్రిని(2013లో) భారత జట్టు అతడి నాయకత్వంలోనే సొంతం చేసుకుంది. ధోని అంతలా సక్సెస్ కావడానికి కారణం భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీ కరోనా: రెడ్‌జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే..!
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీలో కొత్తగా 1813 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క రోజులోనే 17 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 27,235 కేసులు నమోదు అయ్యాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో 24గంటల్లో 1933 కేసులు.. 19 మంది మృతి
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,264 సాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1933 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1914 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 18 మంది ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య
ప్రేమ అనే రెండక్షరాలు ఎందరో ప్రాణాలు తీస్తోంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నందుకు ఓ కుటుంబం హత్యకు గురైంది. ప్రేమ పెళ్లి వ్యవహారం ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టింది. చివరికి ప్రాణాలు పోయేంత వరకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతీ, యువకుడు బాగానే ఉన్నా.. కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నిలకడగా అమితాబ్ ఆరోగ్యం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. ఆస్పత్రి యాజమాన్యం అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసింది. అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్ల వెల్లడించారు. ప్రస్తుత్తం అమితాబ్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉన్నట్లు తెలిపారు. అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
చిట్టచివరి రైతు వరకూ రైతుబంధు సాయం అందించాలి
రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని సిఎం అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా తెచ్చిన కష్టం.. ట్రైనింగ్ కోసం కారు అమ్మకానికి పెట్టిన ద్యుతిచంద్
కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం కుదేలైంది. మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు జరగలేదు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. దీంతో క్రీడాకారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన ట్రైనింగ్ కోసం బీఎండబ్ల్యూ కారు అమ్మాలని నిర్ణయించుకుంది భారత స్టార్ స్ర్పింటర్ ద్యుతిచంద్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి