ఏపీ కరోనా: రెడ్‌జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే..!

By సుభాష్  Published on  12 July 2020 8:33 AM GMT
ఏపీ కరోనా: రెడ్‌జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే..!

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీలో కొత్తగా 1813 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్క రోజులోనే 17 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 27,235 కేసులు నమోదు అయ్యాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్‌ జోన్‌ ప్రాంతాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 97 ప్రాంతాలు రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఈనెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఏపీ సర్కార్‌ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

రెడ్‌ జోన్‌లో ఏఏ ప్రాంతాలు:

విశాఖ జిల్లా: వైజాగ్‌ పట్టణం, పద్మనాభం, నర్సీపట్నం

తూర్పుగోదావరి జిల్లా: శంఖవరం, పెద్దాపురం, అడ్డతీగల, కొత్తపేట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు, నరసాపురం, పెనుగొండ, భీమవరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉండి, కొవ్వూరు.

ప్రకాశం జిల్లా: ఒంగోలు, చీరాల, కారంచేడు, గుడ్లూరు, కందుకూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి.

గుంటూరు జిల్లా: గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, కారంపూడి, దాచేపల్లి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి.

నెల్లూరు జిల్లా: నెల్లూరు, నాయుడుపేట, తడ, అల్లూరు, వాకాడు, ఇందూకూరుపేట, బోగోలు, బాలాయపల్లె, బుచ్చిరెడ్డిపాళెం,గూడూరు, కావలి, కోవూరు, ఓజిలి, తోడపల్లి గూడూరు.

కృష్ణా జిల్లా: విజయవాడ, మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేట, నూజివీడు.

కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లి, కోడుమూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, ఉయ్యాలవాడ, పెద్దకడుబూరు, ఆవుకు, ఎమ్మిగనూరు.

కడప జిల్లా: ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరు,వేంపల్లె, ఎర్రగుండ్ల.

అనంతపురం జిల్లా: హిందూపురం, కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తచెరువు, సెట్టూరు.

ఈ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో వీటిని రెడ్‌ జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

Next Story