న్యూస్‌మీటర్ టాప్ -10 న్యూస్
By సుభాష్ Published on 1 Aug 2020 1:25 PM GMT28 ఏళ్ల తర్వాత రెండో సారి అయోధ్యకు మోదీ
ఈనెల 5న అయోధ్యలో రామమందిర భూమి పూజ కార్యక్రమం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం వేదికపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేవలం ఐదుగురికే చోటు ఉంటుందని రామాలయ తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత రెండు సారి ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యకు వస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో లక్షా యాభైవేలు దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 60,797 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,276 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,209కి చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కరోనా పరిస్థితులు, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య.. వైద్యుల హెచ్చరిక
కరోనా తెస్తున్న తంటాలు అన్నీ..ఇన్నీ కావు. కరోనా బారిన పడిన వారిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్తగా అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారి బారి నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అద్వానీ, జోషిలకు అందని అయోధ్య ఆహ్వానం..!
కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థానంగా బావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబువుతోంది. భూమి పూజ కోసం చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బ్రేకింగ్: మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
కరోనాకు ఓ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు (60) కన్ను మూశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నెల రోజులుగా కరోనాతో బాధపడుతున్న మాణిక్యాలరావు తుదిశ్వాస విడిచారు. 1961లో తాడేపల్లి గూడెంలో జన్మించిన ఆయన.. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో తాడేపల్లి గూడెం .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అంతా సిద్ధం: బిగ్‌బాస్-4 హోస్ట్‌గా నాగార్జున
తెలుగులో మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. అంతా సరిగ్గా జరిగితే బిగ్‌బాస్-4 షో ఈ పాటికే ప్రారంభమయ్యేది. కాని కరోనా నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు స్టార్ మా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
విశాఖ : హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా.. భారీ క్రేన్ ఒక్క సారిగా కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో 10 కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. క్రేన్ కింద పలువురు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కొడుకును ప్రపంచానికి చూపించిన పాండ్య
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్య రెండు రోజుల క్రితం తండ్రైన విషయం తెలిసిందే. తన ప్రేయసి సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్‌కు పండంటి బాబుకు జన్మనివ్వగా.. కుమారుడిని ఎత్తుకున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు హార్థిక్. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టాడు. అందులో బుజ్జి పాండ్య చాలా అం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బీఫ్ తీసుకుని వెళ్తున్నాడని సుత్తితో దాడి చేసిన వ్యక్తులు.. పోలీసులు అలా చూస్తూ ఉండిపోయారు..!
బీఫ్ తీసుకుని వెళుతున్నాడనే అభియోగాలపై కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని నడిరోడ్డు మీద చితకబాదారు. సుత్తి తీసుకుని ఓ వ్యక్తి బాదుతూ ఉంటే.. మరో వ్యక్తి తన్నుతూ కనిపించాడు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు సదరు వ్యక్తిని కాపాడాలని కూడా అనుకోలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి