కొడుకును ప్రపంచానికి చూపించిన పాండ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2020 10:00 AM GMT
కొడుకును ప్రపంచానికి చూపించిన పాండ్య

టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్య రెండు రోజుల క్రితం తండ్రైన విషయం తెలిసిందే. తన ప్రేయసి సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిక్‌కు పండంటి బాబుకు జన్మనివ్వగా.. కుమారుడిని ఎత్తుకున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు హార్థిక్‌. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్‌ పెట్టాడు. అందులో బుజ్జి పాండ్య చాలా అందంగా ముద్దులొలికేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్ధిక్‌కు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూనియర్‌ పాండ్య చాలా క్యూట్‌గా ఉన్నాడని, కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా ఒకవైపు ఆనందంలో మునిగితేలుతూ.. మరోవైపు పితృత్వపు మాధుర్యాని ఆస్వాదిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి కాకముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక పాండ్యా తన తండ్రి బాధ్యతలు చెప్పటి.. కొత్తగా పుట్టిన బిడ్డ కోసం ''బేబీ డైపర్స్'' తీసుకెళ్తున్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌ తరువాత వెన్నముకకు ఆపరేషన్‌ చేయించుకున్నాడు పాండ్య. ఆ తరువాత కొద్ది నెలలు విశాంత్రి తీసుకున్నాడు. అనంతరం ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. రిలయన్స్‌ జట్టు తరుపున డీవై పాటిల్‌ టోర్నీలో మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిద్దపడగా.. కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడింది. సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 13వ సీజన్‌ ప్రారంభం కానుండగా.. పాండ్య ముంబై ఇండియన్స్‌ తరుపున బరిలోకి దిగనున్నాడు.

Next Story