సెలబ్రిటీలకు ఉండే క్రేజే వేరు. వారు ఏం చేసిన అవి క్షణాల్లో వైరల్‌ అవుతాయి. ఓ ఇద్దరు సెలబ్రిటీలు ఒకే రకమైన పోస్టులు చేస్తే.. ఇంకేమన్నా ఉందా..? ఇద్దరి మధ్య సంథింగ్‌.. సంథింగ్‌ అంటూ గుసగుసలు వినిస్తాయి. వారిపై వివిధ ర‌కాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. కొంద‌రు సెల‌బ్రిటీస్ అయితే ఇవి పుకార్ల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు తేల్చేస్తూంటారు. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు మాత్రం.. అస్స‌లు ప‌ట్టించుకోరు. ప్రస్తుతం టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శుభ్‌మన్‌ గిల్‌, సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలాకాలంగా ఒకరినొకరు అనుసరిస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు అనేక విషయాల్లో
ఇద్దరు అనేక విషయాల్లో కామెంట్లు పెడుతున్నారు. ఆ మధ్యన గిల్‌ ఓ కారుకొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. దానికి సారా అభినందలు తెలిపింది. అప్పుడు వెంటనే నీ బదులు సారాకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రో అని గ్రిల్‌ను టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్య కవ్వించాడు.

View this post on Instagram

I spy 👀

A post shared by Ꮪhubman Gill (@shubmangill) on

తాజాగా శుభ్‌మన్‌ ఇన్‌స్టాలో ఓ అందమైన ఫొటో పోస్ట్‌ చేశాడు. మనోహరమైన ప్రదేశంలో బెంచ్‌పై కూర్చొని.. కాలుమీద కాలువేసుకుని ఉన్నాడు. ఆ ఫోటోకి ‘ఐ‌ స్పై‌’ అని కామెంట్ పెట్టాడు. రెండు ఎమోజీ (కళ్లు)లను కూడా జత చేశాడు. మరోవైపు అదేసమయానికి యాదృచ్ఛికంగా అదే సమయానికి సారా కూడా తన అందమైన ఫొటో పెట్టి ‘ఐ‌ స్పై‌’ అని పోస్ట్‌ చేయడమే కాకుండా అవే ఎమోజీలను కూడా పెట్టారు.

వారు ఇద్దరు పోస్టు చేసిన ఫోటోలు వ్యక్తిగతమైనవే అయినప్పటికీ ఒకే సమయంలో ఒకే తరహా వ్యాఖ్యలు పెట్టడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వీరిలో ఎవరు ఎవరిపై నిఘా పెట్టారో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తప్ప తెలీదు. ఈ పోస్టుల పుణ్యమా అని సారా, శుభమన్‌ గిల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సారా వయసు 22 కాగా.. శుభ్‌మన్‌ వయసు 20.

View this post on Instagram

I spy 👀

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *