సచిన్‌కు సెంచరీలు చేయడం మాత్రమే తెలుసు.. కానీ ఆ విషయం తెలీదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 12:57 PM GMT
సచిన్‌కు సెంచరీలు చేయడం మాత్రమే తెలుసు.. కానీ ఆ విషయం తెలీదు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌ సొంతం. అత్యధిక శతకాలు, పరుగుల రికార్డులు ఇప్పటికి మాస్టర్‌ బ్లాస్టర్‌ పేరు మీదనే ఉన్నాయి. ఇక క్రికెట్‌ అభిమానులు సచిన్‌ ను దేవుడిగా చూస్తారు. 21 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌ సచిన్‌ సొంతం. ఎన్నో మ్యాచుల్లో టీమ్‌ఇండియాకు మరుపులేని విజయాలు అందించాడు. కాగా.. టీమ్‌ఇండియాకు తొలి ప్రపంచ కప్‌ను అందించిన దిగ్గజం కపిల్‌ దేవ్‌ మాస్టర్ బ్లాస్టర్‌ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

సచిన్‌కు సెంచరీలు ఎలా చేయాలో తెలుసు.. కానీ వాటిని డబుల్‌, ట్రిబుల్‌ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియదు అని కపిల్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా మహిళ క్రికెట్‌ జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌కు ఇచ్చిన ఇంట్వర్యూలో కపిల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. సచిన్ గొప్ప ప్రతిభావంతుడు. అలాంటి ఆడగాడిని ఇంతకముందు ఎన్నూడూ చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో సచిన్‌కు బాగా తెలుసు. కానీ ఆ సెంచరీలను డబుల్, ట్రిపుల్ శతకాలుగా ఎలా మలచాలో తెలియదు. సెంచరీ చేసిన తరువాత సచిన్ ఎక్కువగా సింగిల్స్ తీసుకునేవాడు. ఎక్కువ వేగంగా బ్యాటింగ్‌ చేసేవాడు కాదు. అతను ఎప్పుడూ క్రూరమైన బ్యాట్స్‌మన్‌ కాలేడు అని అన్నారు

టెస్టుల్లో సచిన్‌ 51 సెంచరీలు బాదాడు. అందులో 20 సార్లు 150పైగా పరుగులు చేశాడు. మొదటి డబుల్‌ సెంచరీ సాధించడానికి పదేళ్లు పట్టింది. మొత్తంగా ఆరు డబుల్‌ సెంచరీలు చేశాడు. అయితే.. డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సచిన్‌ టాప్‌ టెన్‌లో కనిపించడు. అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్ లు కూడా ఆరు ద్విశతకాలు సాధించారు. అయితే.. సచిన్‌ మాత్రం ఈ రికార్డుల్లో సచిన్‌ 12వ స్థానంలో ఉన్నాడని అన్నాడు. 200టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సచిన్‌ కేవలం ఆరు డబుల్‌ సెంచరీలు మాత్రమే సాధించాడని.. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు సచిన్‌ అని గుర్తు చేశాడు. సచిన్ తన కెరీర్‌లో ఎక్కువ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,921 పరుగులు సాధించగా.. వన్డేల్లో 18,426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Next Story