కరెంట్‌ బిల్లు చూసి.. భజ్జీ షాక్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 9:27 AM GMT
కరెంట్‌ బిల్లు చూసి.. భజ్జీ షాక్‌..!

కరోనా సమయంలో కరెంట్ బిల్లులను చూసి సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకూ షాక్ కు గురయ్యారు. ఎంతో మంది తమ జీవితంలో చూడనంతటి కరెంట్ బిల్లులను చూశామని వాపోయారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసలే ఆదాయాలు అంతంత మాత్రమే.. ఇప్పుడు ఈ కరెంట్ బిల్లులు చూస్తుంటే ఎవరికైనా టెన్షన్ తప్పదు. ఎలా కట్టాలి భగవంతుడా అని అందరూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇవి పవర్ సంస్థల్లో ఉన్న తప్పుల కారణంగా మొదలయ్యాయా లేక.. నిజంగానే వినియోగదారులు అంత మొత్తంలో కరెంట్ ను వినియోగిస్తున్నారా అన్నది ఎవరికీ క్లారిటీ లేదు.

తాజాగా టీమిండియా వెటరన్‌ ఆటగాడు, స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరెంటు బిల్లును చూసి షాక్ కు గురయ్యాడు. సాధారణంగా వచ్చే కరెంట్ బిల్లు కంటే ఏడు రెట్లు ఎక్కువ బిల్లును పంపించారని.. తన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ల బిల్లును కూడా తనకే పంపించారా అని హర్భజన్ అడిగాడు. అదానీ ఎలెక్ట్రిసిటీ ని ప్రశ్నిస్తూ భజ్జీ ట్వీట్ చేశారు. కరోనాతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని, భారీ కరెంట్ బిల్లులతో విద్యుత్ సంస్థలు జనాలను మరింత బాధపెడుతున్నాయని హర్భజన్ చెప్పాడు. ఇంతకూ భజ్జీ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..? రూ. 33,900 అట..! వచ్చే నెల 17వ తేదీలోగా బిల్లు కట్టాలని సదరు సంస్థ కోరిందని భజ్జీ ట్వీట్ చేశాడు.హర్భజన్ సింగ్ టీమ్ ఇండియా తరపున చివరిసారిగా 2016 లో ఆడాడు. ముంబై ఇండియన్స్ తరపున భజ్జీ ఐపీఎల్ లో బాగా రాణించాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్ లో భజ్జీ 11 మ్యాచ్ లలో 16 వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్ కోసం భజ్జీ, భజ్జీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story