ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

By సుభాష్  Published on  1 Aug 2020 11:44 AM GMT
ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగే ఈ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కరోనా పరిస్థితులు, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా నిర్మించనున్న సచివాలయ నిర్మాణం, నియంత్రణ సాగు వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది.

Next Story