హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2020 7:53 AM GMT
హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

విశాఖ : హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా.. భారీ క్రేన్‌ ఒక్క సారిగా కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో 10 కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. క్రేన్ కింద పలువురు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో క్రేన్‌ వద్ద 20 మందికి పైగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.

ఈ భారీ క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు. 10 ఏళ్ల కిందట దీనిని షిప్ యార్డు కార్యకలాపాల నిమిత్తం కొనుగోలు చేశారు. ఈ క్రేన్ హిందూస్థాన్ షిప్ యార్డుకు చెందినదే అయినా దాని నిర్వహణను ఇటీవలే ఔట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది.

మంత్రి అవంతి ఆరా..

షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు

Next Story