ప్రకాశం జిల్లాల్లో విషాదం.. శానిటైజర్‌ తాగి 8 మంది మృతి

By సుభాష్  Published on  31 July 2020 4:56 AM GMT
ప్రకాశం జిల్లాల్లో విషాదం.. శానిటైజర్‌ తాగి 8 మంది మృతి

ప్రకాశం జిల్లాల్ విషాదం చోటు చేసుకుంది. శానిటైజర్‌ తాగి 8 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర జీవనం సాధించే యాచకులు మద్యానికి బానిసలయ్యారు. అయితే మద్యం ధరలు పెరగడంతో వారు కొద్ది రోజులుగా శానిటైజర్లు సేవిస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు 108 సమాచారం అందించి దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కురిచేడులోని పీఎస్‌ సమీపంలో ఉండే రమణయ్య గురువారం ఉదయం శానిటైజర్‌, నాటుసారా కలిపి సేవిస్తుండగా, స్థానికులు గమనించి వారించారు. కానీ అప్పటికే తాగేశాడు. ఇంటికెళ్లాక అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.

కురిచేడులో శానిటైజర్‌ తాగి అస్వస్థతకు గురైన వారిలో శుక్రవారం మరో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులు అనుగొండ శ్రీను (25), తిరుపతయ్య (35), గుంటక రామిరెడ్డి (60), రమణయ్య (62) రాజారెడ్డి (60), రమణయ్య (65)గా గుర్తించారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా గత పది రోజులుగా మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో యాచకులు, స్థానికులు శానిటైజర్‌ తాగారని గ్రామస్థులు తెలిపారు. మరి కొందరు కూడా అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒకే యాచకుల బృందానికి చెందిన వీరంతా వేరు వేరు ప్రాంతాల్లో తిరుగుతూ మృతి చెందినట్టు గుర్తించారు పోలీసులు. వీరంతా శానిటైజర్ తాగారా.. నాటుసారా తాగి చ‌నిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story