కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వై.సీతానగరంలో చోటుచేసుకుంది. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవటం రెండు కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. వై.సీతానగరానికి చెందిన మహాదాసు శ్రీను దంపతులకు ఇద్దరు కుమారెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారై రమ్య శ్రీదేవి(20) డిగ్రీ చదువుతోంది. మూడు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణపురం గ్రామానికి చెందిన వ్యక్తితో బుధవారం పెళ్లి జరిగింది. వరుడు ఆమెకు స్వయానా మేనమాన.

కాగా.. శుక్రవారం ఆమె ఎలుకల మందు తినింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మండలపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి లేదా.. చదువు మధ్యలో ఆగిపోతుందనే బాధతోనైనా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని బావిస్తున్నారు. మృతురాలి కాల్‌డేటా ఆదారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కాగా.. మృతురాలు ఇటీవలే డార్క్‌ వేలంటైన్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. లవ్‌ ఫెయిల్యూర్‌ ప్రధానాంశంగా రూపొందించిన ఈ హరర్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *