అంతా సిద్ధం: బిగ్‌బాస్‌-4 హోస్ట్‌గా నాగార్జున

By సుభాష్  Published on  1 Aug 2020 8:48 AM GMT
అంతా సిద్ధం: బిగ్‌బాస్‌-4 హోస్ట్‌గా నాగార్జున

తెలుగులో మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక నాలుగో సీజన్‌ ప్రారంభం కానుంది. టెలివిజన్‌ రంగంలో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ ఇంతా అంతా కాదు. అంతా సరిగ్గా జరిగితే బిగ్‌బాస్‌-4 షో ఈ పాటికే ప్రారంభమయ్యేది. కాని కరోనా నేపథ్యంలో కాస్త బ్రేక్‌ పడింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు స్టార్‌ మా అధికారికంగా ప్రకటించింది. ఇక బిగ్‌బాస్‌-4కు హోస్టుగా ఎవరన్నదానిపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. వీటన్నింటికి తెరదించుతూ బ్యాక్‌ ఆన్‌ ది ఫ్లోర్‌ విత్‌ లైట్‌, కెమెరా యాక్షన్‌ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ త్వరలోనే ప్రారంభం అవుతుందని, వ్యాఖ్యాతగా నాగార్జున వ్యవహరించనున్నట్లు స్టార్‌ మా సైతం ప్రకటన చేసేసింది.

బిగ్‌బాస్‌-3 వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన శైలిలో షోను ఎంతో రక్తి కట్టించారు. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌ చేయనున్నారు. బిగ్‌బాస్‌ -4హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది నిర్వాహకులు సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. మరో వైపు బిగ్‌బాస్‌-4లో కంటెస్టెంట్‌ ఎవరెవరు అన్నది తెలియాల్సి ఉంది.

Biggboss 4

Next Story