న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 22 July 2020 10:14 AM GMTతన ఇంటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పేసిన షారుఖ్ ఖాన్.. ఎందుకంటే..?
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ ఇంటి గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముంబైలోని షారుఖ్‌ఖాన్ బంగళా ‘మన్నత్’ ను ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచడమే..! షారుఖ్ ఖాన్ మన్నత్ బాల్కనీలను ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. పలు సామాజిక మాధ్యమాలు, ఫ్యాన్ క్లబ్ లు ఆ ఫోటోలను పోస్టు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం ఎందుకు?
ఎవరి పని వారు చేయాలి. ఫలానా వారు పని ఎందుకిలా చేస్తున్నారు? అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. కోర్టులు స్పందిస్తున్న తీరుతో ప్రభుత్వాలకు.. ప్రభుత్వ వ్యవస్థల్లో పని చేసే కీలక అధికారులకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. అదే సమయంలో తాము అందరికి బాధ్యులమన్న విషయాన్ని మరిచిపోయి.. ముఖ్యమంత్రి ముందుకు వెళ్లి తమను తాము సమర్థించుకుంటూ న్యాయస్థానాల మీద పితూరీలు చెప్పుకోవటం సంచలనంగా మారింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్ విడుదల.. ఫ్రీగా చూడొచ్చన్న వర్మ
నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెర్కెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు వర్మ. అంతకముందు వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ లీకైందని, దీని వెనుక తన ఆఫీసు స్టాప్ హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ట్రైలర్ ను వీక్షించేందుకు రూ.25 చెల్లించిన .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ రిజల్ట్ మాటేమిటి?
కరోనాకు చెక్ చెప్పే వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నిమ్స్ (నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో తొలి అడుగు సక్సెస్ అయ్యింది. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ఫలితాలు బాగున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు వాలంటీర్లకు కొవాక్జిన్ వ్యాక్సిన్ ను ఇవ్వటం.. వారి ఆరోగ్యం బాగుండటంతో వారిని డిశ్చార్జ్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఢిల్లీ జనాభాలో 23శాతం మందికి కరోనా వైరస్
దేశంలోకరోనా వైరస్ తీవ్రంగా ఉంది. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉన్న జనాభాలో 23 శాతం మందికి కరోనా వైరస్ యాంటీబాడీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో తేలింది. అయితే దేశంలో కరోనా వైరస్ ప్రారంభమై దాదాపు ఆరు నెలలు గడుస్తోంది. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఇన్ని నెలల్లో 23.48 శాతం మంది కరోనాకు గురయ్యారు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గ్రేటర్ హైదరాబాద్‌లో 703.. జిల్లాల్లో 727 కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక హైదరాబాద్‌లో మాత్రం పాజిటివ్ కేసులకు అంతే లేకుండాపోతోంది. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ కంటే జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేసులు రాగా, ఇందులో జీహెచ్‌ఎంసీ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇకపై బెంగళూరులో లాక్ డౌన్ ఉండదు.. ప్రజలు సహకరించాలని కోరిన యడ్యూరప్ప
బెంగళూరు: బెంగళూరు నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా వారం రోజుల పాటూ లాక్ డౌన్ ను విధించారు. జూన్ 22 తో లాక్ డౌన్ ముగియనున్న కారణంతో ఇకపై బెంగళూరులో లాక్ డౌన్ ఉండదని ప్రజలు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ ను అదుపులోకి తీసుకుని రావడానికి తమ ప్రభుత్వం 24 గంటలూ కష్టపడుతోందని అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలపై సీఎంవో ప్రెస్ నోట్ లో ఏముంది?
కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించటం.. బులిటెన్ విడుదల చేయటంతోపాటు.. ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టును పలువురు ఆశ్రయిచటం.. పిటిషన్ల విచారణ సందర్భంగా అధికారుల వ్యవహారశైలిని.. వారు అందించే వివరాలపైనా తెలంగాణ హైకోర్టు పలుమార్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. సోమవారం ఇలాంటి పరిస్థితిని అధికారులు ఎదుర్కొన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారత్ లో వ్యాక్సిన్లు అందరికీ వేయాలంటే రెండు సంవత్సరాలైనా పడుతుంది..!
కరోనా వైరస్ కట్టడి కోసం ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ప్రస్తుతం అన్నింటికంటే ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా, వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించడంలేదని, పైగా రెట్టింపు రక్షణ కలుగుతోందని ఆస్ట్రాజెనెకా వర్గాలు తెలిపాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారత్‌లో 12లక్షలకు చేరువైన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 648 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 28,732 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 7,53,050 కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,11,133 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి