న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  16 July 2020 10:24 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

అర్చకులకు కరోనా పాజిటివ్‌.. రమణ దీక్షితులు సంచలన ట్వీట్

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ట్వీట్‌ చేశారు. స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని, మరో 25 మంది అర్చకులకు కరోనా పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందన్నారు. దర్శనాలను నిలిపేయడానికి ఈవో, ఏఈవో లు అంగీకరించడం లేదని చెప్పారు. ఈవో, ఏఈవోలు చంద్రబాబు విధానాలనే కొనసాగిస్తున్నారని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

29 రోజులకే కూలిపోయిన రూ.264 కోట్ల బ్రిడ్జి

బీహార్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు. ఇక వరదల దాటికి ఓ వంతెన కూడా కూలిపోయింది. అయితే వంతెన నిర్మించి నెల రోజులు కూడా కాలేదు. కేవలం 29 రోజులకే కుప్పకూలిపోయింది. రాష్ట్రంలోని గండక్‌ నదిపై బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జిని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రారంభించారు. ఇది జరిగి 29 రోజులు మాత్రమే గడుస్తోంది. ఇక భారీ వర్షాలకు వచ్చిన వరదలకు గోపాల్‌గంజ్‌లోని సత్తర్‌ఘాట్‌ ప్రాంతంలో వంతెనలో కొంత భాగం నదిలో కూలిపోయింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో 38వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,304 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2593 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 2584 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 38044కి చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అమితాబ్‌ ప్రత్యేక పోస్ట్‌.. ఆరు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కరోనా సోకి ప్రస్తుతం ముంబాయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బిగ్‌బి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, మరో వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశాలున్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే అమితాబ్‌ కూడా తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

శకుంతల దేవి ట్రైలర్.. విద్యా బాలన్ మరో మాస్టర్ పీస్ తో మన ముందుకు..

విద్యాబాలన్ నటించిన ‘శకుంతల దేవి’ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. భారత్ కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలైన శకుంతల దేవి పాత్రను పోషిస్తోంది. విద్యాబాలన్ తనదైన శైలిలో యాక్ట్ చేసి ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోసిందని ట్రైలర్ ను చూడగానే తెలుస్తోంది. శకుంతల దేవి జీవిత చరిత్రకు.. విద్యాబాలన్ నటన, డైలాగ్స్ సరిగ్గా సెట్ అయ్యిందని అంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి రేప్, మర్డర్ బెదిరింపులు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రియా చక్రవర్తి మంచి స్నేహితులు అనే సంగతి బాలీవుడ్ మొత్తానికి తెలుసు. సుశాంత్ మరణించిన తర్వాత రియా చక్రవర్తి గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుశాంత్ మరణం ఆమెను కబళించి వేసింది. ఇటీవలే సుశాంత్ ను తాను ఎంత మిస్ అవుతున్నానో పోస్టు పెట్టింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రోజూ తినే ఆహారంతోనే కరోనా నుంచి రక్షించుకోవచ్చు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి గుజగజ వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్‌ లేని కారణంగా రోజురోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవడమే మార్గం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాపిస్తుంది. ఇతర మందులకు పెట్టే ఖర్చు తినే ఆహారానికి పెడితే ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హోం క్వారంటైన్‌లో దాదా.. ఎందుకంటే..?

భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతడి సోదరుడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్ బెంగాల్‌(సీఏబీ) జాయింట్‌ సెక్రటరీ స్నేహాశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడమే అందుకు కారణం.’స్నేహాశీష్‌ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయగా.. అతడికి పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం బెల్లె వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు మండలం చీకటాయపాలెం చెరువు కట్టపై అర్థరాత్రి తుమ్మకర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. అయితే మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మృతులంతా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5జీ సంబంరం ఓకే.. మీరు వాడే స్మార్ట్ ఫోన్ పని చేస్తుందా?

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన కంపెనీ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు జియో సిద్ధంగా ఉందని.. వచ్చే ఏడాదికి తాము 5జీ సేవల్ని అందిస్తామని కీలక ప్రకటన చేసింది. అంబానీ నోటి నుంచి ఈ ప్రకటన వచ్చినంతనే అన్ని మీడియా సంస్థలు విశేషమైన ప్రాధాన్యతను ఇచ్చాయి. టాప్ స్టోరీ కింద మార్చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story
Share it