శకుంతల దేవి ట్రైలర్.. విద్యా బాలన్ మరో మాస్టర్ పీస్ తో మన ముందుకు..

By Medi Samrat  Published on  16 July 2020 8:50 AM GMT
శకుంతల దేవి ట్రైలర్.. విద్యా బాలన్ మరో మాస్టర్ పీస్ తో మన ముందుకు..

విద్యాబాలన్ నటించిన 'శకుంతల దేవి' ట్రైలర్ ఈరోజు విడుదలైంది. భారత్ కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలైన శకుంతల దేవి పాత్రను పోషిస్తోంది. విద్యాబాలన్ తనదైన శైలిలో యాక్ట్ చేసి ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోసిందని ట్రైలర్ ను చూడగానే తెలుస్తోంది. శకుంతల దేవి జీవిత చరిత్రకు.. విద్యాబాలన్ నటన, డైలాగ్స్ సరిగ్గా సెట్ అయ్యిందని అంటున్నారు.

చిన్న వయసులోనే గణితం మీద పట్టు సాధించిన శకుంతల దేవి గణితంలో ఎన్నో వండర్స్ చేయడాన్ని సినిమాలో చూపించారు. ఆమె లండన్ కు వెళ్లి అక్కడి వారిని ఆశ్చర్య చకితులను చేయడం ఈ ట్రైలర్ లో చూపించారు. శకుంతల దేవిని హ్యూమన్ కంప్యూటర్ అనే వారు. ఆమె 1982 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. 13 అంకెల గుణకారాన్ని కేవలం 28 సెకెండ్లలో చేసి ప్రపంచాన్నే అబ్బుర పరిచింది.

ఈ సినిమాలో శంకుతల దేవి పర్సనల్ లైఫ్ గురించి చూపించారు. తన కుమార్తె అనుపమతో ఉన్న రిలేషన్ షిప్ గురించి కూడా చూపించారు. అనుపమ పాత్రను శాన్య మల్హోత్రా పోషించింది. వారిద్దరి మధ్య ఉన్న బంధం.. తన తల్లి కుమార్తె గురించి కంటే గణితం గురించే ఎక్కువ సమయం కేటాయించడాన్ని అనుపమ సహించకపోవడం ట్రైలర్ లో చూపించారు.

శకుంతల దేవి ఎంతో గొప్ప గణిత శాస్త్రజ్ఞురాలు, ఆమె భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటింది. గణితంలో ఎన్నో పుస్తకాలను రాశారు శకుంతల. ఆమె హోమో సెక్సువాలిటీ గురించి రాసిన The World of Homosexuals అనే పుస్తకం అప్పట్లో సంచలమైంది. 1977లో రాసిన పుస్తకం భారీగా హిట్ అయ్యింది. ఆ భాగాన్ని కూడా సినిమాలో చూపించారు.

ఈ సినిమాకు అను మీనన్ దర్శకత్వం వహించారు. మే 2020న సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ లాక్ డౌన్ వలన విడుదల చేయలేకపోవడంతో డిజిటల్ రిలీజ్ కు నిర్మాతలు మొగ్గు చూపారు. శకుంతల దేవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 31న విడుదల కాబోతోంది.

Next Story