అమితాబ్‌ ప్రత్యేక పోస్ట్‌.. ఆరు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి

By సుభాష్  Published on  16 July 2020 9:17 AM GMT
అమితాబ్‌ ప్రత్యేక పోస్ట్‌.. ఆరు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కరోనా సోకి ప్రస్తుతం ముంబాయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బిగ్‌బి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, మరో వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశాలున్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే అమితాబ్‌ కూడా తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక అమితాబ్‌ ఆరోగ్య కార్యకర్తలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో అభిమానుల కోసం ప్రత్యేక పోస్టు పెట్టారు. ఆరు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. వారు ఎవరంటే..

- ఇతరులపై ఎప్పుడూ అసూయ పడేవారు

- ఎదుటి వ్యక్తులపై ఎప్పటికప్పుడు అయిష్టత ప్రదర్శించేవారు

- ఇతరులపై ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు

- ఎప్పుడూ కోపంగా ఉండవారు

- ఇతరులను ఎప్పుడు అవమానించే వారు

ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు దూరంగా ఉండాలని కోరారు అమితాబ్‌. ఇలాంటి వారి జీవితంలో ఉంటే దుఃఖం తప్ప, సంతోషం ఉండదని, సాధ్యమైనంత వరకు ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మేలని అన్నారు.

Next Story