న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  16 Sep 2020 10:30 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.ర‌వితేజ సూప‌ర్ హిట్ సాంగ్‌ను ‘మ‌క్కీకి మ‌క్కీ’ దించేశారుగా..!

కైరా అద్వానీ.. తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’‌, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయరామ’ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ప్ర‌స్తుతం కైరా మ‌రికొన్ని తెలుగు సినిమాల‌లో న‌టిస్తుండ‌టంతో పాటు.. బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ సంగీతం అందిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇష్టం ఉంటేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే.. విద్యా సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు

అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈనెల 21వ తేదీ నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించింది. విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లాలని, లేకుండా ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌ క్లాసులు వినవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పాఠశాలకు వెళ్లని విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా లేఖను సమర్పించాలని పేర్కొంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బిల్‌గేట్స్‌ ఇంట విషాదం

మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్‌ ఇంట విషాదం నెలకొంది. సోమవారం ఆయన తండ్రి విలియం హెన్రీ గేట్స్‌ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఈ విషయాన్ని బిల్‌ గేట్స్‌ వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్యే ఆయన తుది శ్వాస విడిచారని చెప్పారు. తన తండ్రి మరణం ఎంతగానో బాదించిందన్నారు. “జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని, తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని” గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నా తండ్రి నిజమైన బిల్ గేట్స్ అని ట్వీట్‌ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శుభవార్త: 21 నుంచి 40 ప్రత్యేక రైళ్లు

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సెప్టెంబర్‌ 21 నుంచి దేశ వ్యాప్తంగా 40 క్లోన్‌ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ, అధిక వెయిటింగ్‌ లిస్టులు ఉన్న రూట్లలో ఈ క్లోన్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ క్లోన్‌ రైళ్లకు పది రోజులకు ముందే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ స్టార్ హీరో తండ్రి ఫిట్‌నెస్‌ చూస్తే షాకే.. వ‌య‌సు 82 ఏళ్లు

పందెంకోడి సినిమాతో తెలుగు సినీ అభిమానుల‌కు ప‌రిచ‌య‌మైన విశాల్.. త‌న‌ పిట్‌నెస్ ఎంత బాగా మెయింటెన్ చేస్తారో తెలిసిందే. కండ‌లు తిరిగే దేహంతో ఔరా అనిపించేలా ఉంటాడు హీరో విశాల్‌. అయితే.. ప్ర‌స్తుతం హీరోగా రాణిస్తున్న విశాల్ పిట్‌నెస్ మెయింటెయిన్ చేయ‌డం ఓకే.. హీరో విశాల్‌ తండ్రి జీకే రెడ్డి తెలుసు క‌దా..!.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రామ్‌గోపాల్‌ వర్మ బయోపిక్‌ మొదలైంది

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇప్పటికే ఎన్నో బయోపిక్‌లను తెరకెక్కించాడు. ఇక తన బయోపిక్‌నే తీయనున్నట్లు గతంలో వెల్లడించాడు వర్మ. ఈ బయోపిక్‌ మూడు భాగాలుగా రానుందని చెప్పిన సంగతి తెలిసిందే. మూడు పార్టుల్లో ముగ్గురు వ్యక్తులు నటించనున్నారు. కాగా.. మూడో పార్టులో వర్మనే నటించనున్నాడు. వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో తన బయోపిక్ తెరకెక్కుతుందోంది. ఇక ఈ బయోపిక్‌కి సంబంధించిన మొదటి అడుగు తాజాగా పడింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Fact Check : లడఖ్ లో ఎం17 విమానం కూలిపోయిందా..?

ఎం17 హెలికాఫ్టర్ లడఖ్ లో కూలిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. కొందరు పాకిస్థానీ జర్నలిస్టులు కూడా విమానం కూలిపోవడంపై ట్వీట్లు పెట్టారు. ఫేస్ బుక్ లో కూడా పలువురు దీనిపై పోస్టులు పెట్టారు. Indians please check is this your M 17 crashed in Laddakh? We will keep you posted of any developments అంటూ సెప్టెంబర్ 13న పోస్టులు పెట్టారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రావణి ఆత్మహత్య కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్ట్‌

టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రధాని నిందితులైన ముగ్గురిలో దేవరాజ్‌, సాయికృష్ణలను ఇది వరకే పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఏ2గా చేర్చిన పోలీసులు.. అశోక్‌రెడ్డికి ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్‌ఆర్‌ నగర్ పోలీసు స్టేషన్‌కు వస్తానని చెప్పిన అశోక్‌ రెడ్డి ఇంత వరకు హాజరు కాలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏ భారత క్రికెటర్‌కు నా రికార్డు లేదు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ టీమ్‌ఇండియా ఆటగాడు సాధించని రికార్డును తాను సాధించానని అంటున్నాడు విజయ్‌ శంకర్‌. ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ఆడుతున్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో పోస్టు చేసిన ఓ వీడియోలో శంకర్‌ మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధాలు చెప్పాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 108 అంబులెన్స్‌కు నిప్పంటించిన రౌడీషీటర్‌

ప్రకాశం జిల్లాలో ఓ రౌడీ షీటర్‌ బీభత్సం సృష్టించాడు. ఒంగోలులో రౌడీషీటర్‌ సురేష్‌ 108కి తరచూ రాంగ్‌ కాల్స్‌ చేస్తుండటంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌ విచారించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం నరేష్‌ వింత వింతగా ప్రవర్తిస్తూ పోలీస్‌ స్టేషన్‌ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో అతనికి గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను రప్పించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story