ర‌వితేజ సూప‌ర్ హిట్ సాంగ్‌ను 'మ‌క్కీకి మ‌క్కీ' దించేశారుగా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2020 9:45 AM GMT
ర‌వితేజ సూప‌ర్ హిట్ సాంగ్‌ను మ‌క్కీకి మ‌క్కీ దించేశారుగా..!

కైరా అద్వానీ.. తెలుగులో మహేశ్ బాబుతో 'భరత్ అనే నేను'‌, రామ్‌చరణ్‌తో 'వినయ విధేయరామ' చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ప్ర‌స్తుతం కైరా మ‌రికొన్ని తెలుగు సినిమాల‌లో న‌టిస్తుండ‌టంతో పాటు.. బాలీవుడ్‌లో 'ఇందూకి జవానీ' అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ సంగీతం అందిస్తున్నారు.

అయితే.. ఈ చిత్రంలోని ఓ పాట‌ను చిత్ర యూనిట్ బుధవారం రోజున‌ విడుదల చేసింది. 'హసీనా పాగల్ దివాని' అంటూ సాగే సాంగ్‌లో కైరాతో పాటు ఆదిత్య సియల్ ఆడిపాడారు. రెండు గంట‌ల క్రితం టీ సిరీస్ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా రిలీజ్ అయిన‌‌ ఈ సాంగ్.. ప్ర‌స్తుతం నెట్టింట‌ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.‌

అయితే.. బాలీవుడ్ జ‌నాల‌కు ఈ పాట ట్యూన్‌ కొత్తగా అనిపించి ఉండొచ్చేమో గానీ.. మ‌నోళ్లు ఆ ట్యూన్‌ను 2002లో వినేశారు. ఎందుకంటే ఆ పాట పూరి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజ‌ రవితేజ హీరోగా న‌టించిన‌ 'ఇడియట్‌' సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంప‌కే' ట్యూన్‌ను స‌రాస‌రీ కాఫీ చేసిన‌ట్లు ఉంది. ఈ సాంగ్ విన్న తెలుగు జ‌నాలు ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న‌ సినిమా సీన్ల‌నే బాలీవుడ్ ద‌ర్శ‌కులు కాపీ కొట్టేవారు.. ఇప్పుడు ట్యూన్లు కూడా కాపీ కొడుతున్నారా..? అని అనుకుంటున్నారు.

Next Story